Viral: నన్నేం చేయమంటారో మీరైనా చెప్పండి..నెట్టింట వ్యక్తి అర్థింపు.. ఆన్‌లైన్‌లో ల్యాప్‌టాప్ ఆర్డరిచ్చాక..
ABN, First Publish Date - 2023-10-10T21:00:34+05:30
ఆన్‌లైన్‌లో డిస్కౌంట్ సేల్ సందర్భంగా ఓ మ్యాక్‌బుక్ ఆర్డరిచ్చిన ఓ వ్యక్తికి చివరకు పాడైపోయిన హెచ్‌పీ ల్యాప్‌టాప్ రావడంతో అతడు దిమ్మెరపోయాడు. తదుపరి ఏం చేయాలో చెప్పండి అంటూ నెటిజన్లను వేడుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఆన్‌లైన్‌లో నిత్యం ఏదోక వస్తువు ఆర్డరివ్వడం మనందరికీ పరిపాటిగా మారింది. సాధారణంగా వెయ్యో, రెండు వేలో పెట్టి ఏదోకటి కొనేస్తుంటాం. ఇక ఆఫర్ల సీజన్లో అయితే వెనక్కుతగ్గేదే లేదంటూ వేలకువేలు పెట్టి స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లు కొనేస్తుంటాం. ఓ వ్యక్తి అచ్చం ఇలాగే చేశాడు. రూ.63 వేలు పెట్టి ఇటీవలే యాపిల్ మ్యాక్ బుక్ కొన్నాడు. ఆ తరువాత పరిస్థితి ఊహించని విధంగా తలకిందులు కావడంతో ప్రస్తుతం అతడు నెట్టింట తన గోడు వెళ్లబోసుకున్నాడు. పరిష్కారం చెప్పండంటూ నెటిజన్లు ఆశ్రయించాడు.
Viral: వామ్మో.. ఇజ్రాయెల్ ఇలాంటి బాంబులు వాడుతోందా..? నెట్టింట కలకలం!
ఇంతకీ ఏం జరిగిందంటే ఢిల్లీకి చెందిన వ్యక్తి అక్టోబర్ 7న రూ.63 వేలు పెట్టి మ్యాక్‌బుక్‌కు ఆర్డరిచ్చాడు. డబ్బు కూడా ఆన్‌లైన్‌లోనే చెల్లించాడు. ఆ మరుసటి రోజు ప్యాకేజీ డెలివరీ అయ్యింది. అది ఓపెన్ బాక్స్ డెలివరీ కాకపోవడంతో ఆ వ్యక్తి తన ఫోన్ వచ్చిన పిన్ నెంబర్‌ను డెలివరీ ఏజెంట్‌కు ఇచ్చి ప్యాకేజీ తీసుకున్నాడు. కానీ బాక్సు ఓపెన్ చేసి చూస్తే మాత్రం మ్యాక్‌బుక్‌కు బదులు ఓ పాడైన హెచ్‌పీ పెవిలియన్ ల్యాప్ టాప్ కనిపించింది(Man Orders MacBook From Amazon During Sale Receives Broken HP Laptop Instead). దీంతో, అతడు దిమ్మెరపోయాడు. మరోమార్గం లేక మళ్లీ అమెజాన్ వాళ్లను, ప్రాడక్ట్ అమ్మిన వాళ్లను, ఈమెయిల్స్, ఫోన్ల ద్వారా సంప్రదించాడు. తన ప్రాడక్టుకు 14 రోజుల్లోపు కొత్త దానితో రీప్లేస్ చేసుకునే అవకాశం ఉండటంతో ఆ రూట్లో దరఖాస్తు చేసుకున్నాడు.
Viral: బస్సు సీట్లను చూస్తే ఇలా ఎప్పుడైనా అనిపించిందా? చాలా పెద్ద కుట్ర!
కానీ అటువైపు నుంచి ఇంకా స్పందన రాకపోవడంతో చివరకు ఆ కస్టమర్ నెటిజన్లను ఆశ్రయించాడు. తనకు మరో మార్గం ఏదైనా ఉంటే చెప్పండని వేడుకున్నాడు. తను కొనుగోలు చేసిన తేదీ నుంచి ఇప్పటివరకూ చూస్తే మ్యాక్‌బుక్ రేటు పెరిగిందని, కాబట్టి భవిష్యత్తులో ఇలాగే రేటు పెరిగితే తాను ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పుకొచ్చాడు. గతంలో ఇలాంటి అనుభవం ఎవరైనా ఎదుర్కొన్నారా అని కూడా నెటిజన్లను ప్రశ్నించాడు. ఈ పరిస్థితుల్లో తను ఏం చేయాలో చెప్పండంటూ వేడుకున్నాడు. దీంతో, ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా(Viral) మారింది.
Viral: ఫోన్ చోరీ అయితే పోనీలే అనుకున్నాడు! మరో ఫోన్‌లో కొత్త సిమ్ కార్డు వేశాక భారీ షాక్..!
Updated Date - 2023-10-10T21:03:49+05:30 IST