ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒకవైపు కార్ యాక్సిడెంట్.. మరొకవైపు సింహాల గుంపు.. అనారోగ్యంతో ఉన్న భార్యను హాస్పిటల్ కు తీసుకెళ్తుంటే జరిగిందిదీ..

ABN, First Publish Date - 2023-03-12T14:51:07+05:30

తొందరగా వెళ్ళిపోతాంలే కంగారు పడకు నీకేం కాదు నేనున్నా కదా.. అని ఆమెకు ధైర్యం చెప్పాడు కానీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అసలే భార్యకు అనారోగ్యం చేసిందనే కంగారులో ఉన్నాడు అతడు. ఆమెను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా హాస్పిటల్ కు తీసుకెళ్ళాలని ఆమెతో కలసి కారులో బయల్దేరాడు. పక్క సీట్లో భార్య పడుతున్న ఇబ్బంది చూడలేక కారు వేగం పెంచాడు. 'తొందరగా వెళ్ళిపోతాంలే కంగారు పడకు నీకేం కాదు నేనున్నా కదా..' అని ఆమెకు ధైర్యం చెబుతున్నాడు. కానీ వారికున్న సమస్యకు జతగా మరొక సమస్య తోడయింది. కారు క్రాష్ అయ్యి రోడ్డు పక్కగాఉన్న చెట్టును ఢీకొంది. దీంతో కారులో ఉన్న భార్యాభర్తలు ఇద్దరూ గాయప్డడారు. అక్కడినుండి బయటపడాలని ప్రయత్నం చెస్తుంటే సింహాల గుంపు అటుగా వచ్చింది. వాటిని చూసి గుండె ఆగినంత పనయింది ఆ భార్యాభర్తలకు ఇద్దరికీ. సినిమా స్టోరీని తలపించే వీరి కథ తెలుసుకుంటే..

దక్షిణాఫ్రికాకు(South Africa) చెందిన మారియో, గ్రేస్ భార్యాభర్తలు. 34ఏళ్ళ గ్రేస్ ముగ్గురు పిల్లల తల్లి. ఈమెకు ఉన్న్టటుండి రక్తపోటు ఎక్కువయ్యి, శ్వాస ఆడటం కష్టమయింది. వేరే సమస్యలు అయితే మెల్లిగా అయినా డాక్టర్ ను సంప్రదించవచ్చు కానీ శ్వాస సమస్య కావడంతో వీరిలో కంగారు పెరిగింది. మొదటే తల్లిదండ్రులకు దూరంగా ఉన్నారు. ధైర్యం చెప్పేవారు, తోడుగా వచ్చేవారు కూడా లేరు. భార్యను ఎక్కువగా ప్రేమించే మారియోకు ఆమె గురించి భయం ఎక్కువయ్యింది. అప్పటికప్పుడు ఆమెను తీసుకుని డాక్టర్ ను కలవడానికి కారులో బయల్దేరారు. పక్క సీటులోనే కూర్చున్న గ్రేస్ ఊపిరి ఆడక ఇబ్బంది పడుతుంటే మారియోకు కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అతను కారు వేగం ఇంకాస్త పెంచాడు, కళ్ళనీళ్ళతో అతనికి అంతా మసకగా కనిపించడంతో డ్రైవింగ్ గాడి తప్పింది. కారు వేగంగా వెళ్ళి రోడ్డు పక్కగా ఉన్న చెట్టును ఢీకొంది.అదే వేగంతో చాలా దూరం వెళ్ళిపడింది. ఈ ప్రమాదంలో కారు చాలా దెబ్బతినింది.

Read also: తాళి కట్టే సమయానికి వరుడి పరిస్థితి చూసి నేరుగా పోలిస్ స్టేషన్ కు వెళ్ళిన వధువు.. అతను ఏం చేశాడంటే..


అసలే శ్వాస సమస్య, రక్తపోటుతో ఇబ్బంది పడుతున్న గ్రేస్ ఈ యాక్సిడెంట్ వల్ల మరింత ప్రమాదంలో పడింది. ఆమె కాలులో తుంటి ఎముకలు విరిగిపోయాయి, శరీరం లోపల, బయటా కూడా చాలా గాయాలయ్యాయి. ఆమె శరీరం నుండి రక్తం ధారగా కారసాగింది. స్పృహలో ఉంది కానీ ఇంచ్ కూడా కదలడానికి వీల్లేనంతగా శరీరం దెబ్బతినింది. ఆమె పరిస్థితి చూసి మారియోకుఏడుపు తన్నుకొచ్చింది. తన పొరపాటు వల్లే ఇలా జరిగిందని అతను బాధపడ్డాడు. ఆమెను చేతుల్లో ఎత్తుకుని అయినా కొంచెం దూరం తీసుకెళ్తే ఏదో ఒక సహాయం అందకపోతుందా అని ఆశ పడ్డాడు. ఆమెను ఎత్తుకోవడానికి ప్రయత్నించినపుడు గ్రేస్ అతనికి ఏదో సైగ చేసింది. ఆమె సైగ చేసిన వైపు చూడగానే అతని గుండె ఆగినెతపనయింది. మూడు సింహాలు పిల్లలను వెంటబెట్టుకుని అక్కడక్కడే తిరుగుతున్నాయి. అవి తమను చూశాయంటే తమకు ప్రాణాపాయమే అని వారికి అర్థమైంది. దీంతో ఏమీ చేయలేక ఆ కారులోనే కూర్చుని బిక్కుబిక్కుమంటూ గడపసాగారు. వారికి రాత్రంతా అలానే గడిచింది. సుమారు 12గంటలు కారులోనే గడిపిన తరువాత అటుగా ఓ కారు వచ్చింది. అందులో డ్రైవర్ వీరిని చూశాడు, వీరి పరిస్థితి తెలుసుకుని వెంటనే హాస్పిటల్ కు తరలించాడు. అన్ని గాయాలయినా, రాత్రంతా శరీరం గడ్డకట్టే చలిలో ప్రాణాలతో బయటపడటం నిజంగా అద్భుతమని డాక్టర్లే ఆశ్చర్యపోయారు. 'టైం వస్తే ఎవరూ తప్పించుకోలేరు.. ఆ టైం రాకపోతే చావు మనల్ని టచ్ చెయ్యదు, వచ్చినదారినే వెళ్ళిపోతుంది' అంటున్నారు మారియో, గ్రేస్ ల గురించి విన్న నెటిజన్లు.

Updated Date - 2023-03-12T14:51:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising