ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బట్టతల ఉందని ఉద్యోగంలో నుంచి తీసేశారు.. బాస్ తీరుపై ఆ ఉద్యోగి కోర్టు మెట్లు ఎక్కితే..

ABN, First Publish Date - 2023-02-13T15:43:19+05:30

విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదనో, ప్రవర్తన సరిగ్గా లేదనో యాజమానులు ఉద్యోగులను తీసేస్తుంటారు. అయితే బ్రిటన్‌లోని ఓ సంస్థ ఓ వింత కారణం చెప్పి తమ ఉద్యోగిని ఇంటికి సాగనంపింది. ఆ ఉద్యోగికి బట్టతల ఉందనే కారణంతో ఉద్వాసన చెప్పింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదనో, ప్రవర్తన సరిగ్గా లేదనో యాజమానులు ఉద్యోగులను తీసేస్తుంటారు. అయితే బ్రిటన్‌లోని ఓ సంస్థ ఓ వింత కారణం చెప్పి తమ ఉద్యోగిని ఇంటికి సాగనంపింది. ఆ ఉద్యోగికి బట్టతల ఉందనే కారణంతో ఉద్వాసన చెప్పింది (Man fired for being bald). దీంతో ఉద్యోగి కోర్టు మెట్లెక్కాడు. ఆ కేసును విచారించిన కోర్టు సదరు సంస్థ ఆ ఉద్యోగికి రూ.70 లక్షలు నష్టపరిహారంగా చెల్లించాలని తీర్పునిచ్చింది. ఈ కేసు బాగా చర్చనీయాంశంగా మారింది (Viral News).

బ్రిటన్‌లోని (Britain) లీడ్స్‌కు చెందిన ఓ సంస్థలో మార్క్ జోన్స్‌ అనే వ్యక్తి సేల్స్ డైరెక్టర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. సేల్స్ డైరెక్టర్‌గా ఉండే వ్యక్తి యువకుడై ఉంటే బాగుంటుందని, 50 ఏళ్ల బట్టతల వ్యక్తి తమకు అక్కర్లేదని మేనేజర్ భావించాడు. బట్టతల కారణం చెప్పి హఠాత్తుగా జోన్స్‌ను ఉద్యోగంలో నుంచి తొలగించాడు. షాకైన జోన్స్ సంస్థపై కోర్టులో దావా వేశాడు. ఆ కేసును విచారించిన న్యాయమూర్తి తాజాగా తీర్పు వెలువరించారు. జోన్స్‌ను ఉద్యోగంలో నుంచి తొలగించడానికి సరైన కారణాన్ని సంస్థ చూపించలేకపోయిందని, బట్టతల ఉండటం లేదా లేకపోవడమనేది ఉద్యోగిని తొలగించడానికి కారణం కాదని న్యాయమూర్తి పేర్కొన్నారు. జోన్స్‌కు సంస్థ రూ. 70.6 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించారు.

పెళ్లి మండపం వరకు వచ్చి.. అక్కడ కనిపించిన దృశ్యం చూసి వెనక్కి వెళ్లిపోయిన వరుడు.. అసలేం జరిగిందంటే..

Updated Date - 2023-02-13T15:43:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising