Marriage Fraud: సినిమాకి మించిన ట్విస్టులు.. పెళ్లి పేరుతో ఫ్యామిలీ మొత్తం కలిసి..
ABN, First Publish Date - 2023-08-27T16:50:56+05:30
నిజామాబాద్ జిల్లాలోని బోధన్ మండలానికి చెందిన ఒక యువకుడు ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న అతను.. మ్యాట్రిమొనీలో తన పేరు నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే అతనికి...
ఈజీ మనీకి అలవాటు పడిన వాళ్లు రకరకాల మార్గాల ద్వారా భారీ మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా.. యువకులకు వలపు వల వేసి, వారిని నిండా దోచేస్తున్నారు. అయితే.. చాలామంది పరువు గురించి ఆలోచించి, తమకు జరిగిన అన్యాయంపై నోరు మెదపకుండా మౌనంగా ఉంటున్నారు. కానీ.. కొందరు మాత్రం వారిలాగా మౌనంగా ఉండకుండా, మోసం చేసిన వారికి తగిన బుద్ధి చెప్తున్నారు. పోలీసుల సహకారంతో వారి బండారాల్ని బయటపెడుతున్నారు. ఇప్పుడు ఓ యువకుడు కూడా ఒక ఫ్యామిలీ గుట్టుని విప్పాడు. పెళ్లి పేరుతో మోసం చేసిన వారిని బజారుకీడ్చాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
నిజామాబాద్ జిల్లాలోని బోధన్ మండలానికి చెందిన ఒక యువకుడు ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న అతను.. మ్యాట్రిమొనీలో తన పేరు నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే అతనికి గతేడాది అక్టోబర్‌లో స్వాతి అనే మహిళ పరిచయం అయ్యింది. తొలుత స్వాతినే అతనికి ఫోన్ చేసింది. ఒకరి గురించి మరొకరు తెలుసుకున్నారు. వీడియో కాల్స్ కూడా చేసుకున్నారు. చివరికి ఇద్దరి ఏకాభిప్రాయం కుదరడంతో.. పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఇక్కడి నుంచే అసలు కథ స్టార్ట్ అయ్యింది. ఒక రోజు స్వాతి సడెన్‌గా ఫోన్ చేసి.. తాను రోడ్డు ప్రమాదంలో గాయపడ్డానని, ఆసుపత్రిలో ఉన్నానని, అత్యవసరంగా కొంత డబ్బు కావాలని అడిగింది. ఎలాగో తనకు కాబోయే భార్యే కాబట్టి.. స్వాతి కోరినట్టు వెంటనే డబ్బు పంపించాడు.
ఇక అప్పటి నుంచి స్వాతి తన అవసరాల కోసం డబ్బులు అడుగుతూ.. అతని నుంచి రూ.4 లక్షలు కాజేసింది. చూస్తుండగానే ఏడాది గడిచిపోవడంతో.. పెళ్లి చేసుకుందామని ఆ యువకుడు ఒత్తిడి పెంచాడు. దీంతో.. స్వాతి అతని నంబర్ బ్లాక్ చేసింది. సోషల్ మీడియాలోనూ అన్నిచోట్లా బ్లాక్ చేసింది. ఉన్నట్లుండి స్వాతి తనని బ్లాక్ చేయడంతో.. ఆ యువకుడికి అనుమానం వచ్చి ఆరా తీశాడు. అప్పుడు అతనికి దిమ్మతిరిగే షాక్ తగిలింది. స్వాతికి ఆల్రెడీ పెళ్లి అయ్యిందని.. భర్తతో పాటు పిల్లలు కూడా ఉన్నారని తెలిసింది. దాంతో కోపాద్రిక్తుడైన ఆ యువకుడు.. ఈ విషయమై స్వాతిని నిలదీశాడు. ఆల్రెడీ పెళ్లైనా తనని ఎందుకు మోసం చేశావని ప్రశ్నించాడు. ‘నువ్వే మమ్మల్ని ఇబ్బంది పెట్టావ్’ అంటూ ఆమె బెదిరిస్తూ ఎదురుదాడికి దిగింది.
స్వాతి ఇచ్చిన షాక్‌తో ఖంగుతిన్న ఆ యువకుడు.. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. ఆమెను అదుపులోకి తీసుకొని విచారించారు. అప్పుడు మరిన్ని విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. ఇదంతా ఒక్క స్వాతి ఆడిన నాటకం కాదని.. ఆమె ఫ్యామిలీ మొత్తం కలిసి ఆడిన డ్రామా అని తేలింది. అంటే.. స్వాతి, ఆమె భర్త, ఇద్దరు కూతుళ్లు కలిసే ఈ మోసానికి పాల్పడినట్లు తేలింది.
Updated Date - 2023-08-27T16:50:56+05:30 IST