భార్య మరణిస్తే ఏడాదిలోపు భర్తకు ప్రాణ గండం... కారణాలను పూసగుచ్చినట్లు ఇలా వెల్లడించిన శాస్త్రవేత్తలు!
ABN, First Publish Date - 2023-03-29T10:51:16+05:30
పురుషులకు భాగస్వామి తోడు చాలా అవసరం అని ఓ పరిశోధనలో వెల్లడైంది. పురుషులు జీవిత భాగస్వామి(Spouse) లేకుండా దీర్ఘకాలం జీవించలేరని ఈ పరిశోధనలో తేలింది.
పురుషులకు భాగస్వామి తోడు చాలా అవసరం అని ఓ పరిశోధనలో వెల్లడైంది. పురుషులు జీవిత భాగస్వామి(Spouse) లేకుండా దీర్ఘకాలం జీవించలేరని ఈ పరిశోధనలో తేలింది. స్టేట్ యూనివర్శిటీ ఆఫ్ ఫ్లోరిడా(State University of Florida)లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం పురుషుడు తన మహిళా భాగస్వామిని కోల్పోతే, అతను ఒక ఏడాదిలో మరణించే అవకాశాలు(Chances of death) 70% మేరకు పెరుగుతాయి. జీవిత భాగస్వామిని కోల్పోయిన బాధ పురుషులను అమితంగా ప్రభావితం చేస్తుందని ఈ పరిశోధన(Research)లో వెల్లడైంది.
ఈ పరిశోధన మార్చి 22న PLOS One జర్నల్‌లో ప్రచురితమయ్యింది. AFP వార్తా సంస్థ ఈ పరిశోధనపై ఒక నివేదికను ప్రచురించింది, దీని ప్రకారం చిన్న వయస్సులో తమ జీవిత భాగస్వామి(Spouse)ని కోల్పోయిన వారు ఒక సంవత్సరం లోపు చనిపోయే అవకాశం ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధన సహ-డైరెక్టర్ డాక్టర్ డాన్ కార్(Dr. Dan Carr) మాట్లాడుతూ ఇది సాధారణంగానే జరుగుతుందని, ఎందుకంటే ఎవరికైనా ఆప్తులైనవారు చనిపోతే అది వారి దినచర్య(daily routine)పై ప్రభావం చూపుతుంది.
అప్పుడు డిప్రెషన్(Depression)లోకి వెళతారు. కొందరు ఆల్కహాల్ తీసుకోవడం మొదలు పెడతారు. మౌనంగా ఉంటారు. వ్యాయామం(exercise) చేయరు. భాగస్వామి నుండి విడిపోయిన తర్వాత పురుషులు చనిపోవడానికి ఇదే ప్రధాన కారణం. పైగా అమితమైన ప్రేమతో ఒకరికొకరు ప్రాణంగా ఉండేవారు తమ బంగారు భవిష్యత్తు(future)ను ఊహిస్తారు. ఫలితంగా భార్య చనిపోతే తీవ్రంగా కుంగిపోతుంటారు.
Updated Date - 2023-03-29T10:54:32+05:30 IST