ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాత్రి 2గంటల సమయంలో ఇంటి తలుపు కొడుతున్న శబ్దం.. తలుపుతీసిన భర్తకు ఏం జరిగిందంటే..

ABN, First Publish Date - 2023-02-05T18:57:34+05:30

2గంటల సమయంలో తలుపు తీసిన భర్తకు ఇలా జరుగుతుందని ఆమె కలలో కూడా ఊహించి ఉండదు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోపాల్ తన భార్య నీలిమతో కలసి ఇంట్లో నిద్రపోతున్నాడు. రాత్రి 2గంటల సమయంలో తలుపు చప్పుడు కావడంతో వాళ్ళిద్దరూ మేల్కొన్నారు. 'ఈ టైంలో మనింటి తలుపు కొట్టేది ఎవరు?' అనింది నీలిమ. 'ఏమో చూస్తానుండు' అని లేచివెళ్ళి తలుపు తీసాడు. వెంటనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు. ఉన్నంతలోనే సంతోషంగా సాగిపోతున్న వారి జీవితాన్నిఈ సంఘటన తలక్రిందులు చేసింది. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళితే..

అస్సాం రాష్ట్రంలో మోరిగావ్ లో గోపాల్ తన భార్య నీలిమతో కలసి నివసిస్తున్నాడు. వీళ్ళు ఇల్లు గడవడం కోసం రహదారి ప్రక్కన పకోడా అమ్ముతుంటారు. కాగా గోపాల్ నీలిమ ఇద్దరు ప్రేమించుకుని, పారిపోయి పెళ్ళిచేసుకున్నారు. నీలిమ మైనర్ బాలిక. ప్రస్తుతం ఆమె వయసు17సంవత్సరాలు. దాంతో వాళ్ళిద్దరి పెళ్లి బాల్యవివాహం కిందకి వెళ్ళింది. అస్సాం రాష్ట్రంలో మాతా-శిశు మరణాలు ఎక్కువగా నమోదు అవుతున్నదానికి కారణం బాల్యవివాహాలే అని సర్వేలలో వెల్లడయింది. దాంతో మైనర్ బాలికలను పెళ్ళిచేసుకున్న ఎందరినో అక్కడ అరెస్ట్ చేస్తున్నారు. గత మూడురోజులలోనే 2,278మందిని అరెస్ట్ చేసినట్టు తెలిసింది. వాళ్ళలో గోపాల్ కూడా ఒకడు. అయితే ప్రభుత్వం ముందుగా ఎలాంటి సమాచారం అందించకుండా ఇలా చెయ్యడం చాలా ఘోరం అంటున్నారు ఈ సంఘటనల గురించి విన్నవారు.

'మాకు ఒకటిన్నర నెల కొడుకు ఉన్నాడు. పోలీసులు నా భర్తను తీసుకెళ్తున్నప్పుడు బాబు ఏడుస్తున్నాడు. నా కొడుకు ఏడుస్తున్నాడు సార్, ఇంటిదగ్గర నా భార్య కొడుకును చూసుకుంటూ ఒక్కతే ఉండాలంటే ఇబ్బంది కదా.. కొద్దిసేపు ఆగండి నా తమ్ముడిని పిలుస్తాను' అని గోపాల్ పోలీసులను రిక్వెస్ట్ చేసాడు. అయితే పోలీసులు అవన్నీ పట్టించుకోకుండా అతడి చేతులకు తాళ్ళు కట్టి మరీ లాక్కెళ్ళారు' అని నీలిమ ఏడుస్తూ చెప్పింది. 'నేను నా ఒకటిన్నర నెల కొడుకుతో ఎలా బ్రతకాలి పోలీసులు ఇలా చేస్తే..' అని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. అస్సాంలో, నీలిమలా ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఎంతో మంది ఆడపిల్లలు ఉన్నారట. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.

Updated Date - 2023-02-05T18:58:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising