MS Dhoni: రిటైర్మెంట్‌కు ఇదే సరైన సమయం.. కన్నీళ్లు ఆగడం లేదు.. ఫ్యాన్స్‌కు గిఫ్ట్ ఇస్తా అంటూ ధోనీ ఎమోషనల్!
ABN, First Publish Date - 2023-05-30T09:35:04+05:30
మహేంద్ర సింగ్ ధోనీ తను ఎంతగానో అభిమానించే తమిళ తంబీలకు మరపురాని బహుమతిని అందించాడు. ఐదో సారి చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌ను ఐపీఎల్ విజేతగా నిలబెట్టాడు. సోమవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై చెన్నై విజయం సాధించింది.
మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) తను ఎంతగానో అభిమానించే తమిళ తంబీలకు మరపురాని బహుమతిని అందించాడు. ఐదో సారి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) టీమ్‌ను ఐపీఎల్ (IPL 2023 Winner) విజేతగా నిలబెట్టాడు. సోమవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో (IPL 2023 Final Match)గుజరాత్ టైటాన్స్‌ను ఐదు వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ఓడించి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) టైటిల్‌ను కైవసం చేసుకుంది. కాగా, ఈ సీజన్‌తో ధోనీ ఐపీఎల్‌కు కూడా రిటైర్మెంట్ (Dhoni Retirement)ప్రకటిస్తాడని ఎప్పట్నుంచో ఊహాగానాలు వస్తున్నాయి.
చెన్నై టీమ్, అభిమానులు మాత్రం ధోనీ కొనసాగాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇంతకంటే మంచి సమయం దొరకదని అన్నాడు. ``నేను రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే సరైన సమయం. కానీ.. ఈ సీజన్‌లో నేను ఎక్కడా ఆడినా అభిమానులు నాపై చూపించిన ప్రేమ, ఆప్యాయత, అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను. మరో 9 నెలలు శ్రమిస్తేనే వచ్చే సీజన్‌లో ఆడగలను. అది అంత తేలికైన విషయం కాదు. నా రిటైర్మెంట్ గురించి నిర్ణయం తీసుకోవడానికి ఇంకా నాకు ఆరు, ఏడు నెలల సమయం ఉంది.
ఈ ఏడాది మా జట్టు సమష్టిగా ఆడి నాకు టైటిల్ అందించింది. నేను కూడా వారి పట్ల నెరవేర్చాల్సిన బాధ్యతలు ఉన్నాయి. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగినపుడు చాలా భావోద్వేగానికి గురయ్యా. స్టేడియంలోనే అభిమానులందరూ నా పేరు పలుకుతుంటే కన్నీళ్లు వచ్చాయి. నేను ఎక్కడ ఆడినా అదేవిధంగా ఆదరించారు. నేను ఎప్పుడూ అభిమానులకు రుణపడి ఉంటాన``ని ధోనీ అన్నాడు.
Updated Date - 2023-05-30T09:35:04+05:30 IST