ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nabha natesh : చనిపోతానేమో అనుకున్నా... కానీ బయటపడ్డా!

ABN, First Publish Date - 2023-03-05T19:43:18+05:30

రోడ్డు ప్రమాదంలో గాయపడిన నభా నటేశ్‌ (Nabha natesh)ఈ మధ్యనే కోలుకుని బయటికొచ్చారు. తనకు జరిగిన ప్రమాదం గురించి సోషల్‌ మీడియా వేదికగా తెలిపి షాక్‌కి గురి చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

రోడ్డు ప్రమాదంలో గాయపడిన నభా నటేశ్‌ (Nabha natesh)ఈ మధ్యనే కోలుకుని బయటికొచ్చారు. తనకు జరిగిన ప్రమాదం గురించి సోషల్‌ మీడియా వేదికగా తెలిపి షాక్‌కి గురి చేసింది. దాని వల్లే కొంతకాలంగా సినిమాలు చేయలేదని, ఆ సమయంలో చనిపోతానేమో అనేంత భయం కలిగిందని నభా చెప్పారు. రోడ్డు ప్రమాదం (Nabha natesh Road accident) గురించి మాట్లాడుతూ..‘‘ఈ ప్రమాదం నుంచి కోలుకోవడానికి ఏడాది పట్టింది. ప్రస్తుతం అంతా సెట్‌ అయింది. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నా కానీ ఆ సమయంలో చనిపోతానేమో అన్న భయం కలిగింది. రోడ్డు ప్రమాదం జరిగిన చాలా రోజులకు నేను దాని గురించి బయటకు చెప్పాను. నా భుజం ఎముక విరిగింది. దానికి చాలా సర్జరీలు చేయాల్సి వచ్చింది. కానీ మన జీవితంలో ఇలాంటివి జరిగినప్పుడు మనల్ని ఎంతమంది అభిమానిస్తున్నారో, నిజంగా ఎంతమంది ఇష్టపడుతున్నారో తెలుస్తుంది. ఇప్పుడు మానసికంగా, శారీరకంగా బలపడ్డాను’’ అని అన్నారు. సినిమాల గురించి చెబుతూ ‘‘రోడ్డు ప్రమాదం కారణంగా చాలా అవకాశాలు కోల్పోయా. వాటి కోసం ఎప్పుడూ బాధపడలేదు. ఓ వ్యక్తి ఆరోగ్యంగా ఉండడం అన్నిటికంటే ముఖ్యమైన విషయం తెలిసింది. నాది అనుకున్నది ఎప్పటికైనా నా దగ్గరికి వస్తుందని నేను నమ్ముతాను. ఒకప్పుడు సోషల్‌ మీడియాకు ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఇచ్చేదాన్ని. ఇప్పుడు నేను సోషల్‌ మీడియాలో చివరిస్థానంలో ఉంది. ఇప్పుడు లైక్‌లు, కామెంట్లు, ఫాలోయర్లు ఇవేమీ నాకు ఇప్పుడు పట్టడం లేదు. ఈ మార్పు అంతా నాకు జరిగిన ప్రమాదంతో వచ్చింది’’ అని అన్నారు. (accident change my life - Nabha natesh)

Updated Date - 2023-03-05T19:43:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising