Shocking: 13 మంది అమ్మాయిలతో నగ్నంగా డాన్సులు వేయించిన వ్యాపారవేత్త.. అసలు కారణం తెలిసి విస్తుపోయిన పోలీసులు..!
ABN, First Publish Date - 2023-10-05T17:24:30+05:30
వినియోగదారులను ఆకట్టుకునేందుకు వ్యాపారాలు రకరకాల బహుమతులు, బంపర్ ఆఫర్లు ప్రకటిస్తుంటారు. కానీ, కానీ కస్టమర్లను తన రిసార్ట్ వైపు ఆకర్షించేందుకు ఓ వ్యాపారస్తుడు చేసిన పోలీసులనే నివ్వెరపరిచింది.
ఇంటర్నెట్ డెస్క్: వినియోగదారులను ఆకట్టుకునేందుకు వ్యాపారాలు రకరకాల బహుమతులు, బంపర్ ఆఫర్లు ప్రకటిస్తుంటారు. కానీ, కానీ కస్టమర్లను తన రిసార్ట్ వైపు ఆకర్షించేందుకు ఓ వ్యాపారస్తుడు చేసిన పని పోలీసులనే నివ్వెరపరిచింది. ఏకంగా 13 మంది అమ్మాయిలు నగ్నంగా అక్కడ డ్యాన్స్ చేయడం చూసి షాకైయిపోయారు. మహారాష్ట్రలోని(Maharashtra) నాగ్‌పూర్‌లో ఇటీవల ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
నాగ్‌పూర్‌లోని కుహీ పోలీస్ స్టేషన్ పరిధిలో గల పంచ్‌గావ్ ప్రాంతంలోని ఓ రిసార్టులో నిర్వాహకులు కస్టమర్లను ఆకర్షించేందుకు యువతులతో నగ్న నృత్యాలతో కూడిన పార్టీని ఏర్పాటు చేసినట్టు పోలీసులకు సమాచారం అందించింది. దీంతో, ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కూడా అక్కడి దృశ్యాలు చూసి నివ్వెరపోయారు. నగ్న డ్యాన్సర్లు, భారీ స్థాయిలో డబ్బు, విదేశీ మద్యం కనిపించింది. ఆదివారం రాత్రి ఈ రెయిడ్ జరిగింది. ఈ క్రమంలో పోలీసులు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఏకంగా రూ.49 లక్షల నగదు, విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు(Police raid rave party in Nagpur).
నగ్న ప్రదర్శనకు యువతులను రిసార్టుకు రప్పించిన మధ్యవర్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ పార్టీకి హాజరైన మొత్తం 37 మందిని అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Updated Date - 2023-10-05T17:29:21+05:30 IST