ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nayanthara shocking decision: నయన్‌ శపథం.. ఇకపై అతనితో..

ABN, First Publish Date - 2023-02-11T15:55:35+05:30

లేడీ సూపర్‌స్టార్‌ నయనతార సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమె కోలీవుడ్‌ స్టార్‌ హీరో అజిత్‌కు సవాల్‌ విసిరిందని నెట్టింట ఓ వార్త వైరల్‌ అవుతోంది. ఇకపై ఆమె అజిత్‌తో నటించనని శపథం చేసిందని వార్త చక్కర్లు కొడుతుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లేడీ సూపర్‌స్టార్‌ నయనతార (nayanathara) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమె కోలీవుడ్‌ స్టార్‌ హీరో అజిత్‌కు సవాల్‌ విసిరిందని నెట్టింట ఓ వార్త వైరల్‌ అవుతోంది. ఇకపై ఆమె అజిత్‌(ajithkumar)తో నటించనని శపథం చేసిందని వార్త చక్కర్లు కొడుతుంది. తన భర్త విఘ్నేశ్‌ శివన్‌(Vignesh shivan)కు జరిగిన అవమానమే దీనికి కారణమని తెలుస్తోంది. అసలు విషయం ఏంటంటే.. విఘ్నేశ్‌ శివన్‌.. అజిత్‌తో సినిమా చేయడానికి కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఈ కాంబో సెట్‌ అయిందనే వార్తలు కూడా కోలీవుడ్‌లో వినిపించాయి. కానీ కథ అజిత్‌కు, నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్‌(lyca production)కు అంతగా నచ్చలేదని దర్శకుడికి దృష్టికి తీసుకెళ్లారట. మార్పులకు విఘ్నేశ్‌ శివన్‌ అంగీకరించలేదని కోలీవుడ్‌లో టాక్‌ వినిపించింది. దీనితో నయన్‌ రంగంలోకి దిగి ఈ సమస్యని లైకా సంస్థతో సామరస్యంగా పరిష్కరించే ప్రయత్నం చేసిన ఫలించలేదట. దాంతో ఇగో హర్ట్‌ అయిన నయన్‌ ఇకపై అజిత్‌ సినిమాలో నటించబోనని కానీ..ఆమె ప్రయత్నం ఫలించకపోవడంతో ఇకపై అజిత్‌తో సినిమాలు చేయబోనని ఆమె శపథం చేసినట్లు టాక్‌ వినిపిస్తోంది. (Nayanthara shocking decision)

నయన్‌, అజిత్‌లది హిట్‌ పెయిర్‌. వీరిద్దరూ కలిసి నటించిన బిల్లా, ఆరంభం, విశ్వాసం సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. అజిత్‌తో ఇకపై నటించబోనని నయన్‌ తీసుకున్న నిర్ణయంతో ఫ్యాన్స్‌ షాక్‌లో ఉన్నారు. అసలు ఏం జరిగింది అనేది తెలియాలంటే నయనతార పెదవి విప్పాల్సిందే!

Updated Date - 2023-02-11T15:55:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising