Keerthy Suresh: షామియానాతో బట్టలు కుట్టించుకున్నావా?.. నటిపై ట్రోలింగ్
ABN, First Publish Date - 2023-02-02T11:43:23+05:30
టాలీవుడ్‌తోపాటు దక్షిణాది చిత్ర పరిశ్రమలు అన్నింటిలో మంచి పాపులారిటీ ఉన్న మలయాళీ భామ కీర్తి సురేశ్ (Keerthy Suresh). ‘నేను.. శైలజ’
టాలీవుడ్‌తోపాటు దక్షిణాది చిత్ర పరిశ్రమలు అన్నింటిలో మంచి పాపులారిటీ ఉన్న మలయాళీ భామ కీర్తి సురేశ్ (Keerthy Suresh). ‘నేను.. శైలజ’ (Nenu.. Shailaja) సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన ఈ బ్యూటీ అనంతరం వరుసగా స్టార్లతో సినిమాలు చేస్తూ అగ్రస్థానానికి చేరింది. నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో వచ్చిన ‘మహానటి’ (Mahanati) చిత్రంతో ఈ భామ క్రేజ్ ఒక్కసారిగా పెరిగింది. అయితే ఆ సినిమా తర్వాత ఈ తారకి సరైన హిట్ లేదనే చెప్పాలి. అయినప్పటికీ కీర్తి చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.
అయితే.. . నితిన్, కీర్తి జంటగా ‘రంగ్ దే’ (Rang De) అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకుడు. ఈ యువ దర్శకుడు వివాహం పూజ అనే అమ్మాయితో తాజాగా జరిగింది. ఈ వేడుకకి టాలీవుడ్ నితిన్, కీర్తి సురేష్, డైరెక్టర్ వెంకీ కుడుముల, ప్రొడ్యూసర్ స్వప్న దత్ తదితరులు హాజరయ్యారు. వీటికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో అందరికంటే ఎక్కువగా ఆకర్షించిన విషయం.. కీర్తీ డ్రెస్సింగ్.
కీర్తి ధరించిన ఈ డ్రెస్స్‌లో పలు రంగులు కలిసి ఫంక్షన్లకి వాడే షామియానాలాగా ఉంది. దీంతో ఈ పిక్స్‌పై పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. కామెంట్స్ చేస్తున్నారు. ఈ వేడుకి సంబంధించిన ఓ కీర్తి పిక్‌ని షేర్ చేసి.. ‘మీ దుస్తువులను షామియానాతో కుట్టిస్తే ఇలాగే ఉంటుంది’ అని రాసుకొచ్చాడు. దీంతో.. ‘అవును మాకు అలాగే అనిపిస్తోంది’.. ‘నాకు షామియానా అంటే ఇష్టం.. ఈ షామియానా బేబీ అన్న చాలా ఇష్టం’ అని రాసుకొస్తున్నారు.
Updated Date - 2023-02-02T11:43:25+05:30 IST