Viral: అలాంటి వారు మా పెళ్లికి రావొద్దు.. శుభలేఖలో ఓ జంట వినూత్న విన్నపం.. వైరల్ అవుతున్న ఆహ్వాన పత్రిక..
ABN, First Publish Date - 2023-02-24T20:54:06+05:30
హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లిళ్లు చాలా భారీగా జరుగుతాయి.. ఇరు వర్గాల వారి బంధువులూ పెళ్లికి హాజరవుతుంటారు.. దాంతో వారి మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు, అలకలు, బుజ్జగింపులు సర్వ సాధారణం..
పెళ్లి అంటే సందడి, సంతోషం, వినోదం.. హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లిళ్లు చాలా భారీగా జరుగుతాయి.. ఇరు వర్గాల వారి బంధువులూ పెళ్లికి హాజరవుతుంటారు.. దాంతో వారి మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు, అలకలు, బుజ్జగింపులు సర్వ సాధారణం.. అలాంటి గొడవలు పెద్దవై పెళ్లి ఆగిపోయిన ఘటనలు కూడా చూశాం.. దాంతో గుజరాత్‌కు చెందిన ఓ జంట ముందు చూపుతో ఆలోచించి అలా గొడవలు లేకుండా తమ పెళ్లి సజావుగా జరిగిపోవాలని ప్లాన్ చేసింది.
గుజరాత్ (Gujarat)లోని రాజ్‌కోట్ లోని హడలా గ్రామానికి చెందిన మన్సుక్ సీతాపర కూతురు వివాహం గురువారం జరిగింది. ఈ వివాహ ఆహ్వాన పత్రికలో (Wedding Invitation Card) ముందుగానే ఓ సూచన చేశారు. మందు తాగిన వారు (Drunken people) తమ వివాహానికి హాజరుకావొద్దని శుభలేఖలో పేర్కొన్నారు. ఈ శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral) మారింది. శుభలేఖలో ఇలా పేర్కొనడానికి ఓ కారణం కూడా ఉందట. కొన్ని రోజుల క్రితం ఆ గ్రామంలో జరిగిన పెళ్లి వేడుకలో మందు తాగి వచ్చిన ఇద్దరు అతిథులు గొడవపడ్డారట. దాంతో ఆ వివాహం ఆగిపోయిందట. తమ కుటుంబ విహహం విషయంలో అలాంటి తలనొప్పులు ఉండకూడదనే ఇలా చేశారట.
Viral Video: మనిషిని వెంటాడిన ఎలుగు బంటి.. చెట్టెక్కినా వదలకుండా ఛేజింగ్.. చివరకు..
అలాగే గుజరాత్‌లో మద్య నిషేధం (Prohibition) అమల్లో ఉంది. అయినా అతిథులు మద్యం సేవించి వివాహ కార్యక్రమాలకు హాజరవుతుంటారు. అలాంటి వారిని పట్టుకోవడానికి వివాహ వేడుకల సమయంలో పోలీసులు దాడులు చేస్తుంటారు. మందు బాబులకు ప్రవేశం లేదని ఇలా ముందుగా రాయడం వల్ల తాము పోలీసుల దాడులకు భయపడాల్సిన అవసరం లేదని వధువు తండ్రి తెలిపారు.
Updated Date - 2023-02-24T20:54:08+05:30 IST