Phone Charging: రాత్రంతా ఫోన్ ఛార్జింగ్‌లో పెడితే అసలేం కాదా..? కొన్ని ఫోన్లు మాత్రమే ఎందుకు పేలిపోతుంటాయంటే..!
ABN, First Publish Date - 2023-11-25T18:12:34+05:30
స్మార్ట్ ఫోన్లను చార్జ్ చేసే సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఇంటర్నెట్ డెస్క్: చార్జింగ్‌లో ఉండగా ఫోన్ పేలిపోయిన ఘటనల గురించి చదివినప్పుడల్లా మనసులో ఒక్కసారిగా సందేహాలు మొదలవుతాయి. మొబైల్స్, లాప్‌టాప్స్ చార్జింగ్ విషయంలో చాలా మందికి కనీస అవగాహన ఉన్నప్పటికీ పూర్తి విషయాలు మాత్రం తెలీదనే చెప్పాలి. అయితే, ఫోన్‌ను రాత్రంతా చార్జింగ్ చేస్తే ప్రమాదమా?(charging phone overnight) అసలు మొబైల్ ఫోన్స్‌ను ఎలా చార్జి్ చేయాలి అనే విషయాలపై ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలు(Guidelines) అందుబాటులో ఉన్నాయి.
నిపుణులు చెప్పేదాని ప్రకారం, ఫోన్లో మాన్యుఫాక్చరింగ్ డిఫెక్ట్ ఏదైనా ఉంటే తప్ప సాధారణంగా చార్జింగ్ చేసేటప్పుడు ఎలాంటి ప్రమాదం జరగదు. ఓవర్ చార్జింగ్‌ను అడ్డుకునే వ్యవస్థలు నేటి స్మార్ట్ ఫోన్లల్లో అందుబాటులో ఉన్నాయి. బ్యాటరీ 100 శాతానికి చేరుకోగానే చార్జింగ్ దానంతట అదే నిలిచిపోతుంది.
అయితే, రాత్రంతా ఫోన్ చార్జింగ్‌లో పెట్టి నిద్రపోకూడదు. ఇక ఛార్జింగ్ చేసే ప్రతిసారీ ఫోన్ కేస్‌ను తొలగించాలి. దీంతో, ఫోన్ ఎక్కువ వేడెక్కకుండా ఉంటుంది. మర్చిపోయి రాత్రిళ్లు ఫోన్ చార్జి చేసినట్టైతే మెళకువ రాగానే చార్జింగ్ ఆపేయాలి. షెడ్యూల్ ప్రకారం ఆఫ్ అయిపోయే స్మార్ట్ ప్లగ్ కూడా వాడొచ్చు.
పొరపాటున రాత్రంతా చార్జింగ్ పెడితే ఫోన్ హీటెక్కే అవకాశం లేకపోలేదు. బ్యాటరీ పవర్ 99 శాతానికి చేరుకోగానే చార్జింగ్ మొదలవుతుంది. ఇలా పలుమార్లు జరిగితే బ్యాటరీ జీవితకాలం తగ్గిపోతుంది. ఇక ఫోన్‌ను పుస్తకాలు, దిళ్ల మీద పెట్టి అస్సలు చార్జ్ చేయకూడదు. దీని వల్ల అగ్నిప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి, వీలున్నంత వరకూ ఫోన్ చార్జింగ్‌కు ఓ షెడ్యూల్ పాటించడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Updated Date - 2023-11-25T18:15:46+05:30 IST