Viral News: నేను నీకు ఇల్లు అద్దెకు ఇవ్వను.. అంటూ ఇంటి యజమాని చెప్పిన కారణం విని ఆ బ్యాచులర్ కు మైండ్ బ్లాంక్..!
ABN, First Publish Date - 2023-04-29T12:19:55+05:30
చదువుల కోసం, ఉద్యోగాల కోసం అందరూ పట్టణాల వెంట పడడంతో అక్కడ అద్దె ఇళ్లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఏ మెట్రో సిటీలోనైనా అద్దెకు ఇల్లు దొరకడం చాలా కష్టంగా మారిపోయింది.
చదువుల కోసం, ఉద్యోగాల కోసం అందరూ పట్టణాల వెంట పడడంతో అక్కడ అద్దె ఇళ్లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఏ మెట్రో సిటీలో (Metro City)నైనా అద్దెకు ఇల్లు దొరకడం చాలా కష్టంగా మారిపోయింది. అందులోనూ బ్యాచిలర్స్‌కు అద్దె ఇల్లు (Rented House) దొరకడం మరింత కష్టం. ఎందుకంటే బ్యాచిలర్‌లకు (Bachelors ) అద్దెకు ఇళ్లు ఇవ్వడానికి చాలా మంది ఇష్టపడరు. ఒకవేళ ఎవరైనా ఇద్దామనుకున్నప్పటికీ సవాలక్ష కండీషన్లు పెడుతుంటారు.
ముఖ్యంగా ఐటీ రాజధాని బెంగళూరులో (Bengaluru) ఉద్యోగం దొరకడం కంటే అద్దె ఇల్లు దొరకడం చాలా కష్టం. ఎంత అద్దె అయినా చెల్లించడానికి బ్యాచిల్స్ సిద్ధంగా ఉన్నప్పటికీ ఓనర్లు (House Owner) పెట్టే కండీషన్లకు మాత్రం బెదిరిపోతున్నారు. ఇటీవలి కాలంలో బెంగళూరు ఇళ్ల గురించి చాలా మంది సోషల్ మీడియాలో తమ అనుభవాలను పంచుకుంటారు. ఇల్లు ఇవ్వడానికి ముందు ఓనర్లు చేసి ఇంటర్వ్యూలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ యువకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వాట్సాప్ స్క్రీన్ షాట్ నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.
Viral Video: పట్టపగలే దారుణం.. నడివీధిలో ఓ వ్యక్తిపై దాడి చేసిన దొంగలు.. వైరల్ అవుతున్న వీడియో!
ఆ వాట్సాప్ ఛాట్.. ఇంటి యజమాని, అద్దె ఇంటి కోసం చూస్తున్న అబ్బాయి మధ్య జరిగింది. అద్దె ఇంటి కోసం వచ్చిన అబ్బాయికి 12వ తరగతి మార్కులు (12th class marks) తక్కువగా ఉన్నాయనే కారణంతో ఇంటి యజమాని అద్దెకు ఇల్లు ఇవ్వడానికి నిరాకరించాడు. యజమాని అడిగిన అన్ని డాక్యుమెంట్లూ ఆ కుర్రాడు ఇచ్చాడు. అన్నీ చూసిన ఇంటి యజమాని ఆ కుర్రాడి ఇంటర్మీడియెట్ మార్కులు 90 శాతం కంటే తక్కువ ఉన్నాయని ఇల్లు ఇవ్వడానికి నిరాకరించాడు. ఈ పోస్ట్‌పై సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ``ఇంటర్ మార్కులు మీ భవిష్యత్తును నిర్ణయించలేకపోవచ్చు.. కానీ, బెంగళూరులో మీకు అద్దె ఇల్లు లభిస్తుందో, లేదో కచ్చితంగా నిర్ణయిస్తాయ``ని కామెంట్ చేశారు.
Updated Date - 2023-04-29T12:19:55+05:30 IST