PawanKalyan: ఈ సినిమా షూటింగ్ ముందు మొదలెడతాడట
ABN, First Publish Date - 2023-02-07T16:22:32+05:30
మూడు సినిమాలు కాకుండా ఇంకో రీమేక్ సినిమా చెయ్యడానికి కూడా పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నాడు. దీనికి సముద్రఖని (Samuthirakani) దర్శకుడు ఇది 'వినోదయ సితం' (Vinodhaya Sitham) అనే తమిళ్ సినిమా. ఇందులో సాయి ధరమ్ తేజ్ ఇంకో కథానాయకుడు. ఇన్ని సినిమాల్లో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏ సినిమా షూటింగ్ మొదలెడతాడు అని అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.
యాక్టర్, రాజకీయ నాయకుడు, జనసేన అధినేత (Jana Sena) అయిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇటు రాజకీయాలు, అటు సినిమాల తోనూ చాల బిజీగా వున్నాడు. ఒక పక్క రాజకీయ సభలు, సమావేశాలు, పర్యటనలు చేస్తూనే ఇంకో పక్క కొత్త సినిమాలకు శ్రీకారం చుడుతున్నాడు. ఈమధ్యనే దర్శకుడు సుజీత్ (Director Sujeeth) తో ఒక సినిమా అధికారికంగా మొదలయింది. డీవీవీ దానయ్య (DVV Danayya) దీనికి నిర్మాత. దీనికన్నా ముందు దర్శకుడు హరీష్ శంకర్ తో కూడా 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh) సినిమా చెయ్యాలి. ఈ రెండు కాకుండా డైరెక్టర్ క్రిష్ (Director Krish) తో 'హరి హర వీర మల్లు' (Hari Hara Veeramallu) సినిమా షూటింగ్ చాల భాగం అయి వుంది. ఈ మూడు సినిమాలు కాకుండా ఇంకో రీమేక్ సినిమా చెయ్యడానికి కూడా పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నాడు. దీనికి సముద్రఖని (Samuthirakani) దర్శకుడు ఇది 'వినోదయ సితం' (Vinodhaya Sitham) అనే తమిళ్ సినిమా. ఇందులో సాయి ధరమ్ తేజ్ ఇంకో కథానాయకుడు.
ఇన్ని సినిమాల్లో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏ సినిమా షూటింగ్ మొదలెడతాడు అని అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ సముద్రఖని సినిమా ముందు చేస్తాడని తెలిసింది. ఎందుకంటే ఇందులో పవన్ కళ్యాణ్ కేవలం 25 రోజుల పాటు షూటింగ్ చేస్తే చాలు. అతని పోర్షన్ కంప్లీట్ అయిపోతుందిట. అలాగే తరువాత సుజీత్ సినిమా కూడా అంతే అని చెప్తున్నారు. సుజీత్ సినిమాలో కూడా కేవలం నెల రోజుల లోపు కాల్షీట్స్ ఇస్తే చాలట, ఆ సినిమా కూడా పూర్తి అయిపోతుంది తొందరగా అంటున్నారు. ఈ రెండు అయ్యాక హరీష్ శంకర్ (Director Harish Shankar) సినిమా ఉంటుంది అని చెప్తున్నారు. మధ్య మధ్యలో క్రిష్ సినిమాకి కొన్ని రోజులు కేటాయించి అది కూడా పూర్తి చెయ్యాలనే ఆలోచనలో వున్నాడు పవన్ కళ్యాణ్ అని అంటున్నారు. మొత్తానికి ఎలక్షన్స్ వచ్చేటప్పటికి అన్ని సినిమాలు పూర్తి చెయ్యాలనే ఆలోచనలో వున్నాడు అని తెలిసింది.
Updated Date - 2023-02-07T16:22:33+05:30 IST