ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mother: దుస్తులు ఉతుకుతోంటే గౌనుపై రక్తపు మరకలు.. కంగారుగా ఆ తల్లి వెళ్లి ఆరాతీస్తే.. 7 ఏళ్ల కూతురు ఏడుస్తూ..!

ABN, First Publish Date - 2023-07-17T16:12:03+05:30

కూతురి దుస్తులపై రక్తం మరకలు కనబడటంతో అలర్టైందా తల్లి. ఏం జరిగిందని కూతురిని అనునయంగా అడిగితే స్కూల్‌లో ప్యూన్ చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఈ ఘటన జరిగింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: కూతురి దుస్తులు ఉతుకుతోందా మహిళ. ఇంతలో చిన్నారి గౌనుపై రక్తపు మరకలు కనిపించాయి. అవి చూడగానే కంగారు పడిపోయిందా తల్లి. ఆలస్యం చేయకుండా వెంటనే కూతురి దగ్గరకెళ్లి అడిగింది. మొదట్లో భయంతో ఆ పెద్దపెట్టున ఏడ్చేసింది. దీంతో, ఆ చిన్నారిని తల్లి దగ్గరకు తీసుకుని ఒళ్లో కూర్చోపెట్టుకుని అనునయంగా అడిగితే బాలిక చెప్పింది విని మహిళకు వెన్నులో వణుకు మొదలైంది. దీంతో, ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కామాంధులు కాటువేసేందుకు నిత్యం సిద్ధంగా ఉంటారని చెప్పే ఈ ఘటన రాజస్థాన్‌లోని(Rajasthan) జైపూర్‌లో(Jaipur) ఇటీవల వెలుగు చూసింది.

ఇవీ చదవండి: ఏం తెలివిరా నాయనా..? హ్యాండ్ లాక్ వేసి ఉన్నా సరే.. తాళం లేకుండానే బైక్‌ను ఎలా స్టార్ట్ చేశాడో మీరే చూడండి..!

తను చదివే స్కూల్లో ప్యూన్(Peon) అసభ్యకరమైన పనులు చేస్తున్నాడని ఆ చిన్నారి(7) తల్లితో కన్నీళ్ల పర్యంతమవుతూ చెప్పింది. గతేడాది నాలుగుసార్లు ఇలా చేశాడని చెప్పుకొచ్చింది. ఈ నెల స్కూల్ మొదలయ్యాక అతడు మరోసారి అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పింది. తాను ఇంట్లోవాళ్లకు చెబితే చంపేస్తానంటూ బెదిరించాడని కన్నీటిపర్యంతమైంది. జూలై 12న చివరిసారిగా అతడు బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడగా రెండు రోజుల తరవాత జరిగిన దారుణం(Child molestation) వెలుగులోకి వచ్చింది.

ఈ రైతు చేసిన పొరపాటును మీరెవ్వరూ చేయకండి.. సోషల్ మీడియాలో ప్రభుత్వ ఉన్నతాధికారి విజ్ఞప్తి..

మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న బానాడ్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు.. తానిక స్కూలుకు వెళ్లలేనని చిన్నారి భయపడుతూ చెప్పడంతో తల్లిదండ్రులు ఆమెను ప్రస్తుతం ఇంట్లోనే ఉంచారు. చిన్నారిని మళ్లీ కోలుకునేలా చేసేందుకు కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నారు. ఈ ఘటనతో బాలిక కుటుంబంతో పాటూ స్నేహితులు, బంధువులు, ఇరుగుపొరుగు వారు కూడా షాకయిపోయారు. కాగా, తమ చిన్నారులను తల్లిదండ్రులు ప్రతిరోజు ప్రేమగా దగ్గరకు తీసుకుని మాట్లాడాలని, ఆ రోజు వారు ఏం చేశారో అడిగి తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పిలల్లో ఏమాత్రం మార్పు కనిపించినా అందుకు గల కారణాలను వెంటనే తెలుసుకోవాలని సూచిస్తున్నారు.

Updated Date - 2023-07-17T16:12:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising