ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral News: ప్రత్యేక ఆకృతిలో ఆకట్టుకుంటోన్న యూకే హార్బర్.. ఫొటో నెట్టింట వైరల్

ABN, First Publish Date - 2023-05-26T13:52:10+05:30

ఓ ఫొటోగ్రాఫర్ షేర్ చేసిన యూకేలోని ఓ ద్వీపానికి సంబంధించిన అందమైన ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. మునుపెన్నడూ చూడని ప్రత్యేకమైన అకృతిలో డాల్ఫిన్ రూపలో ఉన్న వేల్స్ హార్బరు అందరినీ ఆకట్టుకుంటోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓ ఫొటోగ్రాఫర్ షేర్ చేసిన యూకేలోని ఓ ద్వీపానికి సంబంధించిన అందమైన ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. మునుపెన్నడూ చూడని ప్రత్యేకమైన అకృతిలో డాల్ఫిన్ రూపలో ఉన్న వేల్స్ హార్బరు(Pwllheli harbour) అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ప్రత్యేక చిత్రాన్ని ఫొటోగ్రాఫర్ రే జోన్స్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. వేల్స్ తీరప్రాంతం(Coastline of Wales) నమ్మశక్యం కాని వన్యప్రాణుల(Wildlife)తో నిండి ఉంది. భూమిపై, సముద్రం క్రింద ఈ ద్వీపం క్షీరదాన్ని పోలి ఉండటంతో ఫేస్‌బుక్ యూజర్లను ఆకర్షిస్తోంది.

నౌకాశ్రయం చుట్టూ ఉన్న వృక్షజాలం, జంతుజాలంతో ప్రత్యేక రూపం

ఫొటోగ్రాఫర్ జోన్స్ ఈ ఫోటో తీసేందుకు డ్రోన్‌ను ఉపయోగించారు. ‘తాను చాలాసార్లు వేల్స్ ప్రాంతానికి వెళ్లానని, ఈ ప్రత్యేక ఆకృతిని ఇంతకుముందెన్నడూ చూడలేదు. ఇదొక అద్భుతమైన ఆవిష్కరణ’ అని ఫొటోగ్రాఫర్ జోన్స్ తెలిపారు.

ఈ దృశ్యాన్ని మే నెల ప్రారంభంలో డ్రోన్ షాట్ తీశానని ఫొటోగ్రాఫర్ తెలిపాడు. ఫోటో డాల్ఫిన్స్ హెడ్‌లాగా కనిపించే UKలోని హార్బర్‌ని చూపిస్తుంది. హార్బర్‌లోని ఇసుక 'డాల్ఫిన్ తల'లా కనిపించే విధంగా విస్తరించింది. నౌకాశ్రయం చుట్టూ ఉన్న వృక్షజాలం, జంతుజాలం ​​దీనికి ప్రత్యేకమైన రూపాన్ని ఇస్తుంది. ఈ ఫొటో నెటిజన్ల బాగా ఆకట్టుకుంది.

ఈ ప్రత్యేక డాల్ఫిన్ చిత్రంలో డాల్ఫిన్ ముక్కు సముద్రంలోకి వెళ్లే నీటిని అడ్డుకునే చిన్నచిన్నరాయి ద్వారా, చిన్నపొదలు నుంచి కన్ను లాగా ఏర్పడినట్లుగా కనిపిస్తుంది. హార్బర్‌లోని ఇసుక 'డాల్ఫిన్ తల'లా కనిపించే విధంగా విస్తరించి ఉంటుంది. ఇసుక వక్రరేఖలు వాలుగా పార్క్ లాంటి నిర్మాణంలో ఉంటాయి. చుట్టూ ఉన్న నీలిరంగు నీరు, బూడిద రాయి మొత్తం ఫోటోకు అసాధారణమైన రంగును అందించాయని ఫొటోగ్రాఫర్ జేన్స్ తెలిపారు.

Updated Date - 2023-05-26T13:54:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising