SubiSuresh: మరో విషాదం, మలయాళంనటి సుబి సురేష్ అస్తమయం

ABN, First Publish Date - 2023-02-22T12:48:08+05:30

కమెడియన్, పాపులర్ యాంకర్, నటి అయిన సుబి సురేష్ (#SubiSuresh) బుధవారం నాడు తుది శ్వాస విడిచారు. (#SubiSureshPaasesAway) ఆమె లివర్ కి సంబంధించిన వ్యాధితో బాధపడుతూ

SubiSuresh: మరో విషాదం, మలయాళంనటి సుబి సురేష్ అస్తమయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దక్షిణాది సినీ పరిశ్రమలో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రోజుల క్రితం తెలుగు చలన చిత్ర పరిశ్రమ ధృవతార నందమూరి తారకరత్న (#NandamuriTarakaRatna) ని కోల్పోయింది. అతని పోయి 24 గంటలు గడవకముందే తమిళ చిత్ర పరిశ్రమ కమెడియన్ నటుడు ఆర్. మయిలస్వామి (#MayilaSwamy) ని పోగొట్టుకుంది. ఈ రెండు విషాదాల నుండీ ఇంకా తేరుకోక మునుపే, మలయాళం పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది.

subi-suresh1.jpg

కమెడియన్, పాపులర్ యాంకర్, నటి అయిన సుబి సురేష్ (#SubiSuresh) బుధవారం నాడు తుది శ్వాస విడిచారు. (#SubiSureshPaasesAway) ఆమె లివర్ కి సంబంధించిన వ్యాధితో బాధపడుతూ కొన్ని రోజుల క్రితం కొచ్చి లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం నాడు తుది శ్వాస విడిచారని తెలిసింది. ఆమె వయసు 42. ఇంత చిన్న వయసులోనే ఆమె పై లోకాలకు వెళ్ళిపోవటం మలయాళ పరిశ్రమలో దిగ్భ్రాంతి కి గురిచేస్తోంది.

సుబి సురేష్ (#SubiSuresh) టీవీ లో చాలా పేరున్న నటిగా మలయాళం లో ఇంటింటా అందరికి పరిచయం. ఆమె కమెడియన్ గా టీవీ ప్రోగ్రామ్స్, అలాగే ఈవెంట్స్ చాలా చేసింది. ఆ తరువాత మలయాళం చిత్ర పరిశ్రమలో నటిగా మంచి పేరు తెచ్చుకుంది. 'కొచ్చిన్ కళాభవన్' (Cochin Kalabhavan) అనే సినిమాతో పరిశ్రమలో ఆరంగేట్రం చేసిన సురేష్ అనతి కాలం లోనే మంచి పేరు తెచ్చుకుంది. ఆమె టీవీ లో మలయాళం కామెడీ షో 'సినీమాల' అనే ప్రోగ్రాం తో ఆరంగేట్రం చేసింది. తరువాత 'కుట్టిపెట్టలం' అనే చిన్నపిల్లలా టీవీ షో ద్వారా, మలయాళం లో ఆమె పేరు మారుమోగింది.

Updated Date - 2023-02-22T12:49:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising