Pawan Kalyan: అభిమానులకు ప్రేమికుల రోజున సర్‌ప్రైజ్!
ABN, First Publish Date - 2023-02-08T20:39:10+05:30
టాలీవుడ్‌లోని స్టార్ హీరోల్లో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఒకరు. పవన్‌కు యూత్‌లోను మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందువల్ల పవర్ స్టార్ నుంచి సినిమా వస్తుందంటే చాలు అభిమానులందరు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.
టాలీవుడ్‌లోని స్టార్ హీరోల్లో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఒకరు. పవన్‌కు యూత్‌లోను మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందువల్ల పవర్ స్టార్ నుంచి సినిమా వస్తుందంటే చాలు అభిమానులందరు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతం పవన్ ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ 60శాతానికి పైగా పూర్తయింది. తాజాగా పవన్‌కు సంబంధించిన ఓ రూమర్ ఫిల్మ్ నగర్‌లో షికార్లు కొడుతుంది. అదేంటంటే..
పవన్ కల్యాణ్ ‘వినోదాయ సీతం’ (Vinodaya Sitham) రీమేక్‌కు ఒకే చెప్పిన సంగతి తెలిసిందే. సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కీలక పాత్రను పోషించనున్నారు. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనుంది. ఈ ప్రాజెక్టు అతి త్వరలోనే పట్టాలెక్కనున్నట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఫిబ్రవరి 14న జరగనున్నట్టు సమాచారం అందుతుంది. ఈ చిత్రంతో సాయి ధరమ్ తేజ్‌కు జోడీగా కేతిక శర్మ (Ketika Sharma) నటించనున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్ ఇప్పటికే హరీశ్ శంకర్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) చేయడానికి అంగీకరించారు. సుజిత్ దర్శకత్వంలో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రెండు సినిమాల పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. కొత్తగా మూడో చిత్రానికీ కూడా సంబంధించిన పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. అయితే, ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ మాత్రం ఇప్పటికీ పూర్తి కాలేదు. కొత్తగా వచ్చి చేరుతున్న ప్రాజెక్టుతో కలపి మొత్తంగా పవన్ వద్ద నాలుగు సినిమాలు అవుతాయి. వీటిలో ఏ సినిమా ఎప్పుడు మొదలవుతుందో, ఎప్పుడు పూర్తవుతుందో అనేది తెలియాలంటే మాత్రం కొంతకాలం వేచి చూడాల్సిందే.
గబ్బర్ సింగ్ తర్వాత పవర్ స్టార్, హరీశ్ కల్యాణ్ కలసి మరోసారి పనిచేస్తుండటంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతుంది. జపాన్, ఇండియా నేపథ్యంలో కొనసాగనున్నట్టు సమాచారం అందుతుంది. ఈ మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించనుంది. ఈ ప్రాజెక్టు అనౌన్స్‌మెంట్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది.
Updated Date - 2023-02-08T20:53:29+05:30 IST