Project K: రెండు భాగాలుగా ‘ప్రాజెక్ట్-కె’..!

ABN, First Publish Date - 2023-02-01T18:58:12+05:30

గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న సినిమా ‘ప్రాజెక్ట్ కె’ (Project K). దీపికా పదుకొణె (Deepika Padukone), అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Project K: రెండు భాగాలుగా ‘ప్రాజెక్ట్-కె’..!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న సినిమా ‘ప్రాజెక్ట్ కె’ (Project K). దీపికా పదుకొణె (Deepika Padukone), అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) కీలక పాత్రలు పోషిస్తున్నారు. బడా ప్రొడక్షన్ హౌస్ వైజయంతి మూవీస్ రూ.500కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వం వహిస్తున్నారు. మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సినిమా తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. ‘ప్రాజెక్ట్- కె’ కు సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్ ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే..

‘బాహుబలి’, ‘పొన్నియిన్ సెల్వన్’ మాదిరిగా ‘ప్రాజెక్ట్- కె’ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సమాచారం అందుతుంది. ‘ప్రాజెక్ట్-కె’ కథ చాలా పెద్దదిగా ఉండటంతో మేకర్స్ రెండు భాగాలుగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. మొదటి భాగంలో పాత్రలను పరిచయం చేయడంతో పాటు ‘ప్రాజెక్ట్-కె’ ప్రపంచాన్ని చూపిస్తారట. ‘బాహుబలి’ ప్రాంచైజీ మాదిరిగా రెండో భాగంలో డ్రామాను చూపిస్తారని సమాచారం అందుతుంది. రెండు భాగాల షూటింగ్ ఒకేసారి జరుగుతుందట. ఫస్ట్ పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తయిందట. మొదటి భాగం విడుదలైన ఏడాది లోపే రెండో భాగాన్ని విడుదల చేయాలని మేకర్స్ ఆలోచనలో ఉన్నారని ఫిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి. కథపై మేకర్స్‌కు పూర్తి నమ్మకం ఉండటంతో ఒకేసారి రెండు భాగాలను చిత్రీకరిస్తున్నారని రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. ‘ప్రాజెక్ట్ కె’ మొదటి భాగం 2024 ఏప్రిల్‌లో విడుదల కానుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే మేకర్స్ నుంచి రానుంది.

Updated Date - 2023-02-01T19:10:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising