ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Priyanka Chopra: సరోగసీని అందుకే ఎంచుకున్నాం

ABN, First Publish Date - 2023-01-20T18:41:44+05:30

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి హీరోయిన్‌గా మారిన అందాల భామ ప్రియాంక చోప్రా (Priyanka Chopra). హాలీవుడ్ నటుడు, సింగర్ నిక్ జోనాస్ (Nick Jonas) ను పెళ్లి చేసుకుంది. ఈ జంట సరోగసీ విధానంలో ఓ పండంటి బుజ్జాయికి జన్మనిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి హీరోయిన్‌గా మారిన అందాల భామ ప్రియాంక చోప్రా (Priyanka Chopra). హాలీవుడ్ నటుడు, సింగర్ నిక్ జోనాస్ (Nick Jonas) ను పెళ్లి చేసుకుంది. ఈ జంట సరోగసీ విధానంలో ఓ పండంటి బుజ్జాయికి జన్మనిచ్చారు. తమ కుమార్తెకు మాల్తీ (Malti) అని పేరు పెట్టారు. సరోగసీ విధానంలో బిడ్డకు జన్మనివ్వడంతో ఆమెపై విమర్శల వర్షం కురిసింది. నెటిజన్స్ అనేకమంది ప్రియాంకను ట్రోల్ చేశారు. ఈ ట్రోల్స్‌పై తాజాగా ఆమె స్పందించింది.

ప్రియాంక చోప్రా తాజాగా ఓ మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. అద్దె గర్భం ద్వారా బిడ్డను ఎందుకు కనాల్సి వచ్చిందో వివరించింది. ‘‘మాల్తీ మూడు నెలలు ముందుగా జన్మించింది. ఆమె పుట్టినప్పుడు నేను ఆపరేషన్ థియేటర్‌లోనే ఉన్నాను. ఆ సమయంలో బరువు చాలా తక్కువగా, నా చేతి కంటే చిన్నగా ఉండేది. ఆమెను చూసినప్పుడు నాకు చాలా బాధేసింది. ఆమెకు సంబంధించిన ఎటువంటి గాసిప్స్ చదవడం నాకు ఇష్టం లేదు. అందుకే మీడియాకు దూరంగా చాలా జాగ్రత్తగా పెంచుతున్నాం. నాకు వైద్యపరమైన సమస్యలు ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో సరోగసీని ఎంచుకోవాల్సి వచ్చింది. మా సరోగేట్ దయ కలిగినది. దాదాపుగా ఆరు నెలల పాటు మా బుజ్జాయిని జాగ్రత్తగా కాపాడింది’’ అని ప్రియాంక చోప్రా చెప్పింది. ఇక కెరీర్ విషయానికి వస్తే.. ప్రియాంక చోప్రా క్వాంటికో షోతో వరల్డ్ వైడ్‌గా ఫేమ్‌ను సంపాదించుకుంది. హాలీవుడ్ నటుడిని పెళ్లి చేసుకోవడంతో అక్కడే స్థిరపడింది. చివరగా ‘ది మ్యాట్రిక్స్ రీ సర్కషన్స్’ (The Matrix Resurrections) లో నటించింది. ఈ చిత్రంలో సాహసోపేతమైన పాత్రను పోషించింది.

Updated Date - 2023-01-20T18:46:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising