ProjectK: అమితాబ్ బచ్చన్ ప్రమాద వార్త నిజం కాదట

ABN, First Publish Date - 2023-03-06T11:53:08+05:30

అమితాబ్ బచ్చన్ కి 'ప్రాజెక్ట్ కె' సినిమా షూటింగ్ లో గాయాలు తగిలాయి అన్న వార్తలో నిజం లేదు అని ఆ సినిమా నిర్మాత అశ్విని దత్ చెప్పారు.

ProjectK: అమితాబ్ బచ్చన్ ప్రమాద వార్త నిజం కాదట
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

భారత లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) 'ప్రాజెక్ట్ కె' (PorjectK) షూటింగ్ లో గాయపడ్డారు అనే వార్త ఇప్పుడు ఒక పెద్ద సంచలనం అయినా విషయం తెలిసిందే. అయితే అందులో అమితాబ్ బచ్చన్ స్వయంగా తన బ్లాగ్ లో తనకి గాయాలు అయ్యాయని, ఇప్పట్లో షూటింగ్ కి కూడా హాజరు కావటం అవదని కూడా తెలిపారు. 'ప్రాజెక్ట్ కె' సినిమాలో ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా, దీపికా పడుకోన్ (Deepika Padukone) కథానాయికగా, నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వం లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రముఖ నిర్మాత అశ్విని దత్ (Ashwini Dutt) నిర్మిస్తున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే.

ashinidutt.jpg

అయితే ఈ ప్రమాద వార్తలను నిర్మాత అశ్విని దత్ స్పందించారు. అమితాబ్ బచ్చన్ కి 'ప్రాజెక్ట్ కె' షూటింగ్ సందర్భంగా ఏమీ ప్రమాదం జరగలేదని చెపుతున్నారు. "మా సినిమా షూటింగ్ లో అమితాబ్ గారికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. మూడు రోజుల క్రితం అయన షూటింగ్ చేసుకొని, బొంబాయి వెళ్లిపోయారు," అని అశ్విని దత్ ని ఆంధ్రజ్యోతి అడుగగా అయన పై విధంగా స్పందించారు. దానికి పెద్దగా ప్రాధాన్యం కూడా ఇవ్వనవసరం లేదని చెప్పారు. అంతకన్న ఏమి చెప్పలేదు అశ్విని దత్ ఈ సంఘటన గురించి.

అయితే సాంఘీక మాధ్యమాలలో, అలాగే ప్రముఖ మీడియా సంస్థలు చానెల్స్ లో అమితాబ్ బచ్చన్ గాయపడ్డారు అన్న వార్త మాత్రం ప్రముఖంగా వేస్తున్నారు. అమితాబ్ బచ్చన్ బ్లాగ్ లో కూడా ఈ విషయాన్ని చెప్పినట్టుగా చాలా మాధ్యమాలు చెప్పుకొస్తున్నాయి. అయితే ఈ సంఘటన జరిగిన వెంటనే కాకుండా, మూడు రోజుల తరువాత ఈ విషయం తెలియటం మాత్రం ఆసక్తికరం.

Updated Date - 2023-03-06T12:56:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising