ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ramabai Latpate: ప్రధాని మోదీ మాటలతోనే స్పూర్తి..80,000 కిలోమీటర్ల ఒంటరి బైక్ ప్రయాణం చేసి రికార్డుకెక్కిన రమాబాయి వినూత్న ప్రయత్నం..!

ABN, First Publish Date - 2023-03-14T07:40:16+05:30

చీర కట్టుతోనే బైక్ మీద ప్రయాణించింది.

Ramabai Latpate
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

దేశాలు దాటేయాలని స్వేచ్ఛగా ఏ అడ్డూ లేకుండా ప్రపంచాన్ని చుట్టిరావాలనే ఆలోచన ప్రతి స్త్రీకి ఉంటుంది. ఇది ఓ కల మాత్రమే. మామూలుగా కనే కల. దానిని ఆచరణలో పెట్టలేనివారే చాలామంది. అయితే ఈ మాటను నిజం చేసేసింది మన రమాబాయి లత్ పటే. సాంప్రదాయ చీరకట్టులో బైక్ మీద దాదాపు 12 G20 సభ్య దేశాలు, 30 అదనపు దేశాలు తిరిగేసి, మరిన్ని ప్రయాణించడానికి తన సోలో బైక్ రైడ్ మిషన్‌లో సిద్ధంగా ఉంది. అందుకే రమాబాయిని భారత్ కీ భేటీ అని ముద్దుగా పిలుస్తారు పూణే జనాలు. ఇంతకీ తన గురించి చెప్పుకోవసి వస్తే..

పూణేకు చెందిన రమాబాయి లత్‌పటే అనే మహిళ, ఇతర స్త్రీల మాదిరిగానే భూగోళాన్ని చుట్టి రావాలని చాలా ఉత్సుకతతో ఉంది, అయితే ఆమెలోని మరేదో ప్రత్యేకత ఆమెను మహిళలందరి కంటే వేరుగా ఉంచింది. లత్‌పటే మహారాష్ట్ర నవరీ చీరను ధరించి ప్రపంచవ్యాప్తంగా ఒంటరిగా బైక్‌పై ప్రయాణించే అద్భుతమైన సాహసాన్ని చేస్తుంది. ఇంతకీ దీనికంతకూ ప్రేరణగా నిలిచింది ఎవరో తెలుసా.. మన ప్రధాని మోదీనేనట. ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనలు తనను ప్రేరేపించాయని రమాబాయి చెప్పుకొచ్చింది. జీ20 సదస్సులో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల ప్రభావంతోనే భారత్‌లో మహిళలు అసాధారణ ప్రగతి సాధిస్తున్నారని రమాబాయి చెప్పింది.

రమాబాయి ఒక వ్యాపారవేత్త, పైలట్ గాలిలో తన అనుభవం, మ్యాప్‌ను చదవగల సామర్థ్యం ఇవన్నీ తనకు చెడు వాతావరణాన్ని తప్పుకుని మార్గాన్ని సుగమం చేసుకోవడం నేర్పింది. రమాబాయి ఈ ప్రయత్నాన్ని ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా నుండి అంతర్జాతీయ మహిళా దినోత్సవమైన 8 మార్చి 2023న తన సోలో బైక్ రైడ్ టూర్‌ను ప్రారంభించింది. ఆమె ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లి ఆ తర్వాత బైక్‌ను ఆస్ట్రేలియాకు ప్రయాణం కట్టనుంది.

ఇది కూడా చదవండి: కాస్త స్టైల్‌గా కనిపించినా ఇదీ ధూమపానమే.. వీటితో గుండెకు చిల్లు ఖాయం..!

పెర్త్, సిడ్నీ మధ్య దాదాపు 1,600 కిలోమీటర్ల ప్రయాణం కష్టతరమైన భాగం. ఈ 1,600 కి.మీ ప్రాంతంలో సరైన మానవ నివాసాలు లేవు అలాంటి చోట కూడా రమా ప్రయాణించనుంది. అక్కడ సెల్‌ఫోన్ కనెక్టివిటీ లేదు. రమాబాయి ఈ యాత్రలో ఒంటరిగా ప్రయాణిస్తుంది. ఎక్కడన్నా విశ్రాంతి తీసుకోవాలనిపించినపుడు మాత్రం అడవిలో ఆగి తనంతట తానుగా డేరాలో గడపాల్సి వస్తుంది. దాదాపు ఈ ప్రయాణం ఒక సంవత్సరం కాలం ఉంటుంది.

ఒక సంవత్సరం పాటు 80,000 కిలోమీటర్లు నడుపుతుంది. రమాబాయి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫ్రాన్స్, న్యూయార్క్, మొరాకో, దుబాయ్ చుట్టి వస్తుంది.

ఖర్చుతో కూడుకున్న పనే..

తన 365 రోజుల సోలో బైక్ రైడ్ ఖరీదు బహుశా కోటి కంటే ఎక్కువగా ఉండబోతోందట. దీనికి గాను రామాబాయి తన SUV , బంగారు ఆభరణాలను విక్రయించడంతో పాటు, తన డబ్బు మొత్తాన్ని ఖర్చు చేసింది. అయితే ఇక్కడ మొత్తం ఖర్చు తను భరించలేదు కనుక రమాబాయి ఒక వ్యక్తి నుంచి రూ. 1 కోసం క్రౌడ్ ఫండింగ్ అభ్యర్థన చేసింది. దీని గురించి ఆమె రెండు కార్పొరేట్ సంఘాలను, ఎన్నికైన అధికారులను సంప్రదించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, రాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ రమాబాయి తన అద్భుతమైన సోలో బైక్ రైడ్‌ని మెచ్చుకున్నారు. ఆమె టైటానిక్ ప్రయత్నానికి మద్దతుగా ఒక్కొక్కరు ఆమెకు ఒక రూపాయి ఇచ్చారు. మరి మనం కూడా రమాబాయి చేస్తున్న ప్రయత్నం విజయం సాధించాలని, ఈ ధైర్యవంతురాలు విజయంతో తిరిగి రావాలని కోరుకుందాం.

Updated Date - 2023-03-14T07:41:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising