ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

R Thyagarajan: ఎవరీ పెద్దాయన..? రూ.6200 కోట్లను దానం చేసేసి.. ఓ చిన్న ఇంట్లో మకాం..!

ABN, First Publish Date - 2023-08-10T12:30:13+05:30

కోట్లు సంపాదించిన వారి గురించి విని ఉంటారు కానీ కోట్లు దానం చేసిన వారి గురించి బహుశా వినడం అరుదేనని చెప్పవచ్చు. కానీ 85ఏళ్ళ ఈ వృద్దుడు 6200కోట్లను దానం చేసి, ఓ చిన్న ఇంట్లో, కనీసం మొబైల్ ఫోన్ కూడా వాడకుండా జీవితాన్ని గడుపుతున్నాడు.

కోట్లు సంపాదించిన వారి గురించి విని ఉంటారు కానీ కోట్లు దానం చేసిన వారి గురించి బహుశా వినడం అరుదేనని చెప్పవచ్చు. భారతదేశంలో ఎంతో మంది వ్యాపారవేత్తలు ఉన్నారు. ఏదైనా వ్యాపారం మొదలుపెట్టి ఓ 20కోట్ల వార్షిక ఆదాయం పొందారంటే సక్సెస్ పర్సన్ అంటూ సోషల్ మీడియా నుండి వార్తాపత్రికల వరకు కోడై కూస్తాయి. కానీ త్యాగరాజన్ అనే పేరు ఎంత మందికి తెలుసు? పురాణాల్లో కర్ణుడిని దానకర్ణుడని గొప్పగా చెప్పారు కానీ 85ఏళ్ళ ఈ వృద్దుడు 6200కోట్లను దానం చేసి, ఓ చిన్న ఇంట్లో, కనీసం మొబైల్ ఫోన్ కూడా వాడకుండా జీవితాన్ని గడుపుతున్నాడు. ఆర్థిక అవసరాలతో కొట్టుమిట్టాడుతున్న సాధారణ ప్రజలకు తన వ్యాపార ఆలోచనలతో వెలుగు బాట చూపించాడు. కలియుగ దానకర్ణుడిగా ఈయన్నుఅభివర్ణించినా తక్కువేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. భారత ప్రభుత్వం నుండి పద్మభూషణ్ అందుకున్న ఆర్. త్యాగరాజన్ గురించి తెలుసుకుంటే..

ఆర్. త్యాగరాజన్(R. Tyagarajan) 1937, ఆగస్టు 25వ తేదీన తమిళనాడు రాష్ట్రం, చెన్నైలో జన్మించారు. గణితంలో గ్రాడ్యుయేషన్, కోల్కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ లో మాస్టర్ డిగ్రీ చేశారు. 1961సంవత్సరంలో న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో చేరారు. అప్పటి నుండి ఈయన పలు ఇన్సూరెన్స్ కంపెనీలలో ఉద్యోగిగా పనిచేశాడు. ఈ కంపెనీలలో పనిచేస్తున్నప్పుడు ప్రజలకు డబ్బు వడ్డీకి ఇవ్వడం పట్ల అన్ని ఫైనాన్స్ లు పాటిస్తున్న రూల్స్ ఈయనకు నచ్చలేదు. అప్పు తీసుకునే సదరు వ్యక్తికి గతంలో అప్పులున్నాయా? అతని ఆదాయం ఏంటి ? వంటి విషయాలు స్పష్టమైతే తప్ప ఫైనాన్స్ కంపెనీలు ఋణాలు ఇచ్చేవి కావు, ఇవ్వడానికి ధైర్యం చేసేవి కావు. పైపెచ్చు త్యాగరాజన్ నివసిస్తున్న చెన్నై చుట్టు ప్రక్కల గ్రామ ప్రజలు తమ జీవనోపాధికోసం ట్రాక్టర్లు, ట్రక్కులు, ఇతర వాహనాలు కొనుగోలు చేయడానికి బ్యాంకులమీద ఆధారపడేవారు. బ్యాంకులు ప్రజలకు ఎక్కువ వడ్డీలకు రుణాలు ఇచ్చేవి. బ్యాంకు అకౌంట్లు లేనివారికి ఇలాంటి అవకాశం కూడా ఉండేది కాదు. ఇవన్నీ త్యాగరాజన్ ను కొత్తగా ఆలోచించేలా చేశాయి. ఆయనతో కొత్త అడుగులు వేయించాయి. 1974లో తన 37ఏళ్ళ వయసులో స్నేహితులు, బంధువులతో కలసి శీరామ్ చిట్స్(Sri Ram Chits) గ్రూప్ ను స్థాపించారు.

White hair: ఏ మెడిసిన్స్ అక్కర్లేకుండానే.. కేవలం కొబ్బరి నూనెతోనే తెల్ల జుట్టును నల్లగా ఎలా మార్చొచ్చంటే..!


చిట్ ఫండ్స్ అని పిలువబడే ఈ సామూహిక పొదుపు పథకం బ్యాంకింగ్ లేనివారికి ఎంతగానో సహాయపడింది. ప్రతి ఒక్క సభ్యుడు నెలవారీ నిర్ణీత మొత్తాన్ని డిపాజిట్ చేస్తారు. ప్రతి నెలా అందరూ డిపాజిట్ చేసిన మొత్తాన్ని ఒక వ్యక్తికి అందిస్తారు. ఈ డబ్బు సదరు వ్యక్తి తన కుటుంబ అవసరాలైన పిల్లల పాఠశాల ఫీజులు కట్టడానికో, వ్యవదారులు వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేయడానికో, చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి పెట్టుబడులుగానో ఉపయోగపడేవి. ఆనాడు ఇలా చిట్ ఫండ్స్ పేరుతో ప్రారంభమైన శ్రీరామ్ ఇప్పుడు 30కంటే ఎక్కువ కంపెనీల సమూహంగా ఎదిగింది. బయటి బ్యాంకులు పైనాన్స్ కంపెనీలలో వడ్డీరేట్లు 30-35శాతం ఉండగా శ్రీరామ్ ఫైనాన్స్ లో 17-18శాతంతో ఋుణాలు ఇచ్చేవారు. ఇలా ఇచ్చిన ఋుణాలలో 98శాతం సమయానికి వసూలు చేస్తారు. ఈ కారణంగా అటు ప్రజలకు ఋణాలివ్వడం, ఇటు తాము ఇచ్చిన రుణాలు సకాలంలో వసూలు చేసుకోవడంతో శ్రీరామ్ గ్రూప్ అంచెలంచెలుగా ఎదిగింది. ప్రస్తుతం శ్రీరామ్ పైనాన్స్ 23మిలియన్ల కస్టమర్లకు సేవలు అందిస్తోంది.

Health Tips: అమ్మ బాబోయ్.. ఒకే ఒక్క లవంగం వల్ల ఇన్ని అద్భుతాలు జరుగుతాయా..? రోజూ పరగడుపున ఓ లవంగాన్ని తింటూ ఉంటే..



ప్రజలకు రుణాలు ఇవ్వడం ఒక ఎత్తైతే.. తన దగ్గర పనిచేస్తున్నవారికి జీతాలు ఇవ్వడం మరొక ఎత్తు. శ్రీరామ్ పైనాన్స్ లో పనిచేసేవారి జీతాలు బయటి ఉద్యాగస్తుల జీతాలతో పోలిస్తే 30శాతం తక్కువగా ఉంటాయి. అయినప్పటికీ ఈ జీతాలు పనిచేసేవారికి ఎక్కువేనని త్యాగరాజన్ చెబుతారు. ఇతరులతో పోలిక ప్రోత్సహించాల్సిన విషయం కాదని ఈయన అంటారు.లక్షా ఎనిమిదివేల మంది ఉద్యోగులున్న శ్రీరామ్ ఫైనాన్స్ విలువ 90వేల కోట్లు. జులై నెలలో వీరి లాభం అక్షరాలా 200మిలియన్ డాలర్లు. వీటన్నింటి వెనుకా త్యాగరాజన్ ప్రణాళికలు ఉన్నాయి. 2006లో శ్రీరామ్ ఓనర్ షిప్ ట్రస్ట్ ను నెలకొల్పారు. 85సంవత్సరాల త్యాగరాజన్ తన ఆస్తులను అన్నింటిని శ్రీరామ్ ఓనర్ షిప్ ట్రస్ట్ కు బదిలీ చేశారు. ఈ ట్రస్ట్ హోల్డింగ్ విలువ 750మిలియన్ డాలర్లకంటే ఎక్కువ. ఇది భారతీయ కరెన్సీలో 6200కోట్లు. ఈ మొత్తాన్ని ఈయన తన కంపెనీ ఉద్యోగ సంఘాల కోసం విరాళంగా ఇచ్చేశారు. శ్రీరామ్ గ్రూప్ నుండి విశ్రాంతి తీసుకున్నారు. ప్రస్తుతం త్యాగరాజన్ చాలా సాధారణ జీవితం గడుపుతున్నారు. ఓ చిన్నపాటి ఇంట్లో ఉంటున్నారు. ఎక్కడికైనా వెళ్ళిరావడానికి ఓ చిన్నపాటి కారు వాడుతున్నారు. మొబైల్ ఉపయోగించడానికి ఇష్టపడటం లేదు. వ్యాపార దినపత్రికలు చదువుతూ, శాస్త్రీయ సంగీతాన్ని వింటూ చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. శ్రీరామ్ గ్రూప్ కు సంబంధించి ఏ వివరాలు ఇక తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. అయినా కంపెనీ సీనియర్ మేనేజర్లు ప్రతి 15రోజులకు ఒకసారి ఈయన్ను కలిసి సలహాలు, సూచనలు తీసుకుంటారు. శ్రీరామ్ కంపెనీని మరింత అభివృద్ది పరిచే దిశగా అడుగులు వేస్తున్నారు.

Viral News: ఇంజనీరింగ్ చదివి ఇదేం పనని అడిగితే.. ఆ క్యాబ్ డ్రైవర్ చెప్పింది విని నోరెళ్ల బెట్టిన మహిళ.. నిజమేనా అని ఆరా తీస్తే..!

Updated Date - 2023-08-10T12:31:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising