ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shocking: రక్తపు వాంతులు చేసుకున్న యువకుడి స్కానింగ్ రిపోర్ట్ చూసి షాకైన డాక్టర్లు.. అవి లోపలకి ఎలా వెళ్లాయో తెలిస్తే..

ABN, First Publish Date - 2023-03-15T14:47:46+05:30

సాధారణంగా చిన్న పిల్లలు తినకూడని పదార్థాలను తెలియక తినేస్తుంటారు. సుద్ద ముక్కలు, రూపాయి బిల్లలు మొదలైన వాటిని మింగేస్తుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

సాధారణంగా చిన్న పిల్లలు తినకూడని పదార్థాలను తెలియక తినేస్తుంటారు. సుద్ద ముక్కలు, రూపాయి బిల్లలు మొదలైన వాటిని మింగేస్తుంటారు. అయితే ఓ 26 ఏళ్ల వ్యక్తికి ఏమైందో ఏమో బ్లేడ్లను తినడం మొదలు పెట్టాడు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 56 బ్లేడ్లను మింగేసి పొట్టలోకి పంపించాడు. చివరకు ప్రాణాల మీదకు రావడంతో డాక్టర్ దగ్గరకు పరిగెత్తాడు. డాక్టర్లు ఆపరేషన్ చేసి మొత్తం బ్లేడ్లను బయటకు తీశారు. అతడికి ప్రాణాపాయం తప్పించారు (Man swallows 56 pieces of razor blades).

రాజస్థాన్ (Rajasthan)కి చెందిన 25 ఏళ్ల యువకుడు నలుగురు స్నేహితులతో కలిసి ఓ రూమ్‌లో ఉంటున్నాడు. సోమవారం ఉన్నట్టుండి ఆ యువకుడు రక్తపు వాంతులు చేసుకున్నాడు. స్నేహితులు వెంటనే అతణ్ని ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు ఎక్స్‌రే తీయించగా ఆ వ్యక్తి కడుపులో ఏదో లోహం ఉన్నట్లు కనిపించింది. ఆ తర్వాత సోనోగ్రఫీ, ఎండోస్కోపీ (Endoscopy) నిర్వహించి ఆ వ్యక్తి కడుపులో ఏకంగా 56 బ్లేడ్లు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అతడికి సర్జరీ (Surgery) చేసి మొత్తం బ్లేడ్లను బయటకు తీశారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు.

నిజానికి బ్లేడ్ తింటే నోటిలోనే గాయలవుతాయి. అందుకే ఆ యువకుడు బ్లేడ్ కవర్ కూడా తియ్యకుండా మింగేవాడు. అలా మొత్తం 56 బ్లేడ్‌లను మింగేశాడు. బ్లేడ్‌ను రెండు ముక్కలు చేసి మింగేవాడు. అయితే కడుపులోకి వెళ్లాక కాగితం ముక్కలు కరిగిపోయి బ్లేడ్‌లు మాత్రమే మిగిలాయి. దాంతో కడుపు లోపల అవి చిన్న చిన్న గాయాలు చేశాయి. అతను అలా బ్లేడ్లు మింగడానికి గల కారణాలేంటో తమకు తెలియదని అతడి బంధువులు, స్నేహితులు చెబుతున్నారు.

పది నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న యువతి.. ఏడాది తిరగక ముందే ఆమె భర్త పరిస్థితి ఏమైందంటే..

Updated Date - 2023-03-15T14:47:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising