ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Phone Call: ఆ ఫోన్‌ కాల్‌ను లిఫ్ట్ చేయకుండా ఉండి ఉంటే.. ఇతడు చనిపోయి ఉండేవాడు కాదేమో.. అసలేం జరిగిందంటే..!

ABN, First Publish Date - 2023-07-11T17:38:29+05:30

రోడ్డు పక్కన పార్కు చేసిన ఉన్న బైక్‌పై కూర్చుని ఫోన్ మాట్లాడుతున్న ఓ వ్యక్తి అనూహ్యంగా మరణించాడు. స్పీడుగా వెళుతున్న ఓ కారు అదుపుతప్పి బైకును ఢీకొనడంతో ఆయన కిందపడి దుర్మణం చెందాడు. రాజస్థాన్‌లో సీకర్ జిల్లాలో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఓ కుటుంబాన్ని విధి వెంటాడింది. రెండేళ్ల క్రితమే ఆ ఇంట్లోని పెద్ద కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆ దుఃఖం నుంచి వారు ఇంకా కోలుకోకమునుపే ఇంటికిపెద్ద దిక్కుగా ఉన్న తండ్రి కూడా దూరమయ్యాడు. ఫోన్ కాల్ రూపంలో ఆయనను దురదృష్టం కబళించింది.

పూర్తి వివరాల్లోకి వెళితే, రాజస్థాన్‌లోని(Rajasthan) సీకర్ జిల్లా(Sikar) మండావ్రా గ్రామానికి చెందిన గోపాల్ బిజార్ణియా(45) తన కూతురిని వైద్య పరీక్షల నిమిత్తం సీకర్ జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇంతలో ఫోన్ కాల్ రావడంతో ఆయన బయటకు వచ్చారు. రోడ్డు పక్కన పార్క్ చేసిన ఉన్న బైక్‌పై కూర్చుని మాట్లాడసాగారు. ఇంతలో వేగంగా వచ్చిన ఓ కారు ఆయన బైక్‌ను ఢీకొట్టింది(Car collides with bike killing man on the spot). దీంతో, ఆయన ఒక్కసారిగా ఎగిరి కిందపడ్డారు. ఆయన తల నేలను బలంగా ఢీకొట్టడంతో తీవ్రగాయాల పాలయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు.

అనంతరం, గోపాల్ మృతదేహాన్ని ఆయన స్వగృహానికి తరలించారు. తండ్రి మృతదేహం చూసి ఆయన కుమార్తె కన్నీరుమున్నీరయ్యింది. ఫోన్ మాట్లాడేందుకు బయటకు వెళ్లిన తండ్రి అకస్మాత్తుగా ఇలా దూరమయ్యాడంటూ కన్నీటిపర్యంతమవడం చుట్టపక్కల వారినీ కదిలించింది. సరిగ్గా రెండేళ్ల క్రితం గోపాల్ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆ ఘటన నుంచి కోలుకోకమునుపే ఇంటిపెద్ద గోపాల్ కూడా మరణించడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో కూరుకుపోయింది. ఫోన్ కాల్ రూపంలో విధి గోపాల్‌ను వెంటాడిందని స్థానికులు విచారం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-07-11T17:41:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising