Rana Daggubati -Nepotism : బంధుప్రీతి కొంతవరకే.. వారికి నేనెవరినో కూడా తెలీదు!
ABN, First Publish Date - 2023-02-24T13:00:07+05:30
నెపోటిజం(Nepotism).. ప్రతి సినిమా ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న సమస్య. పరిశ్రమలో ఏదైన సమస్య ఎదురైన ప్రతిసారి ఇదొక హాట్ టాపిక్‌గా మారుతుంది. అయితే దీనిపై బాలీవుడ్ తారలు ఎందరో గొంత్తెతారు. అప్పుడప్పుడూ టాలీవుడ్‌లోనూ ఈ టాపిక్ వినిపిస్తుంటుంది.
నెపోటిజం(Nepotism).. ప్రతి సినిమా ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న సమస్య. పరిశ్రమలో ఏదైన సమస్య ఎదురైన ప్రతిసారి ఇదొక హాట్ టాపిక్‌గా మారుతుంది. అయితే దీనిపై బాలీవుడ్ తారలు ఎందరో గొంత్తెతారు. అప్పుడప్పుడూ టాలీవుడ్‌లోనూ ఈ టాపిక్ వినిపిస్తుంటుంది. ప్రతిభ ఉన్న కొత్తవారికి అవకాశాలు రావడం లేదని, బంధుప్రీతితో పేరు, నేపథ్యం ఉన్న వారికే అవకాశాలు మూట కడుతున్నారని ఎన్నో సందర్భాల్లో కామెంట్లు వినిపిస్తుంటాయి. ఈ అంశంపై పాప్ సింగర్ స్మిత హోస్ట్‌గా (smita)వ్యవహరిస్తున్న ‘నిజం’ టాక్ షోలో పాల్గొన్న దగ్గుబాటి రానా(Rana Daggubati), నాని (nani)మాట్లాడారు. బంధుప్రీతి కొంతవరకే ఉపయోగపడుతుందని నటనలో ప్రతిభ చూపించకపోతే చిత్ర పరిశ్రమలో నెట్టుకురావడం కష్టమని హీరో రానా (rana) అన్నారు.
ఒక నటుడిగా నా జీవితంలో బంధుప్రీతి, ప్రతిభతో ముందుకెళ్లడం రెండింటినీ చూశాను. నేను తెలుగులో నటుడిగా పరిచయమైనప్పుడు పరిశ్రమలో మనిషినే. కానీ బాలీవుడ్‌లో అడుగుపెట్టినప్పుడు నేను ఎవరో కూడా అక్కడ వారికి సరిగ్గా. నా ఊరు, పూర్తి వివరాలేంటో కూడా వాళ్లకు తెలియదు. సౌత్ నుంచి వెళ్లడంతో నాది చెన్నై అనుకునేవారు. నా దృష్టిలో వారసత్వం అనేది కేవలం మనల్ని పరిచయం చేయడానికే ఉపయోగపడుతుంది. అంతకుమించి కొంచె కూడా ఉపయోగపడదు. వారసత్వం అనే పేరుతో స్టార్స్ అయితే కాలేం. ప్రాంతీయంగా ఉన్న సినిమా పరిశ్రమలన్నీ కలిసి ఇండియన్ సినీ ఇండస్ర్టీగా మారుతుందని పరిశ్రమలోకి అడుగుపెట్టిన సమయంలోనే అనుకున్నా. తొమ్మిదేళ్లు నా మాట ఎవరూ నమ్మలేదు. ఇప్పుడు అంతా ప్యాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. ముఖ్యంగా మన తెలుగు సినిమానే ప్యాన్ ఇండియాలో ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పుడు ఉత్తరాది, దక్షిణాది పరిశ్రమలు అనేది లేదు... మనమంతా ఒకటైపోయాం’’(Pan india) అని రానా తెలిపారు.
కొనసాగించలేకపోవడం తప్పే...
‘‘మా కుటుంబాన్ని ఒక ఉదాహరణ తీసుకుంటే.. మా తాతయ్య (D ramanaidu)ఒక రైతు. ఊర్లో ఉన్న రైస్ మిల్లు అమ్మేసి వచ్చిన డబ్బుతో చెన్నైకు చేరుకుని ఇటుకల వ్యాపారం మొదలుపెట్టారు. తర్వాత సినిమా పరిశ్రమలో అడుగుపెట్టి సుమారు 45 ఏళ్ల పాటు సినిమాలు తీశారు. ఆయన ఇద్దరి కుమారులు మా నాన్న, బాబాయ్ పరిశ్రమలోకి వచ్చారు. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ ఒక స్టూడియో ఏర్పాటు చేశారు. ఒకవేళ నేను ఆ లెగసీని కొనసాగించకపోయినా, ఆ వ్యవస్థని ముందుకకు తీసుకెళ్లకపోయినా అది తప్పు అవుతుంది. నా కుటుంబానికి అన్యాయం చేసిన వాడిని అవుతాను. ఎందుకంటే, లెగసీని కొంతమంది మాత్రమే చూస్తారు. చాలామందికి వారసత్వం వల్ల వచ్చే బరువు, బాధ్యతలు తెలియవు. ముంబైలో రెండు పెద్ద స్టూడియోలైన విజయ వాహిని, ఏవిఎం సంస్థలు ఉన్నట్టుండి కనుమరుగైపోయాయి. దాని వారసత్వాన్ని ఆ కుటుంబం సభ్యులు కొనసాగించలేకపోవడమే దానికి కారణం. ఒక వ్యక్తి.. తన కుటుంబ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లకపోతే అది తప్పు అవుతుంది’’ అని చెప్పారు. రానా.
వాళ్లే కదా నెపోటిజాన్ని ప్రోత్సహిస్తోంది..
ఇదే కార్యక్రమంలో పాల్గొన్న నాని (Nani about nepotism) కూడా నెపోటిజం టాపిక్‌పై స్పందించారు. ‘‘నా దృష్టిలో నెపోటిజాన్ని ఇండస్ర్టీలో ఉన్నవాళ్లు అంతగా ఏం పట్టించుకోవడం లేదు. సినిమాలు చూసే ప్రేక్షకులు దాన్ని ప్రోత్సహిస్తున్నారు. నాని మొదటి సినిమాని లక్షమంది చూశారు. చరణ్ మొదటి సినిమాని కోటి మంది చూశారు. చూసిన వాళ్లే కదా నెపోటిజాన్ని ప్రోత్సహిస్తోంది. మీకు ఏం కావాలో వాళ్లు అది ఇస్తున్నారంతే’’ అని నాని అన్నారు. (nepotism)
Updated Date - 2023-02-24T14:39:47+05:30 IST