Rashmika Mandanna: చేతిపై ‘irreplaceable’ టాటూ.. ఆ అబ్బాయి వల్లేనంటూ..

ABN, First Publish Date - 2023-01-16T10:30:56+05:30

దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా (Rashmika Mandanna). ‘పుష్ప’ (Pushpa) సినిమాతో నేషనల్ క్రష్‌గా మారిపోయింది.

Rashmika Mandanna: చేతిపై ‘irreplaceable’ టాటూ.. ఆ అబ్బాయి వల్లేనంటూ..
Rashmika Mandanna
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా (Rashmika Mandanna). ‘పుష్ప’ (Pushpa) సినిమాతో నేషనల్ క్రష్‌గా మారిపోయింది. ఆ క్రేజ్‌తో వరుసగా బాలీవుడ్‌(Bollywood)లో సినిమాలు కమిట్‌ అవుతోంది. ఈ బ్యూటీ తాజాగా నటించిన బాలీవుడ్ చిత్రం ‘మిషన్ మజ్ను’ (Mission Manju). ఈ మూవీ ఇటీవలే ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైంది. ఈ తరుణంలో జరిగిన ప్రమోషన్ కార్యక్రమంలో తన చేతి మీద ఉన్న టాటూ (tattoo) గురించి పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది.

rashmika1.jpg

రష్మిక మాట్లాడుతూ.. ‘నా చేతి మీద టాటూని వేయించుకునే ముందు నాకు ఏమి కావాలో నాకు తెలియదు. మా కాలేజీలో ఓ అబ్బాయి వచ్చి అమ్మాయిలు ఎక్కువగా నొప్పిని భరించలేరు. వారికి సూదులంటే చాలా భయం అని అన్నాడు. అది విన్న నాకు కోపం వచ్చింది. నేను తప్పని కొట్టి పారేశాను. నేనేంటో చూపించాలని అనుకున్నాను. అప్పుడే ఓ టాటూ వేయించుకోవాలని ఫిక్స్ అయ్యాను. కానీ ఏం టాటూ వేయించుకోవాలో నాకు తెలియదు.

అందుకే దాని గురించి కూర్చొని చాలాసేపు ఆలోచించాను. అప్పుడే ఎవరికీ మరొకరు ప్రత్యామ్నాయం కాదని అర్థమైంది. అదే నేను ఇప్పటికీ ఎప్పటికీ నమ్ముతాను. ఒకరి ఎనర్జీని మరొకరు రిప్లేస్ చేయలేరని భావిస్తాను. నీలాగా మరొకరు ఉండలేరు. అందుకే నువ్వు ఎవరికీ ప్రత్యామ్నాయం కాదు. ప్రతి వ్యక్తి ముఖ్యమైన వాడేనని చూపించాలని, అందరికీ గుర్తు చేయాలనే ఉద్దేశ్యంతో ‘irreplaceable’ టాటూ వేయించుకున్నా’ అని చెప్పుకొచ్చింది.

Updated Date - 2023-01-16T10:30:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising