#Prabhas: 'ప్రాజెక్ట్ కె' నైజాం ఏరియా హక్కులు... షాక్ అవుతారు
ABN, First Publish Date - 2023-02-23T15:19:26+05:30
ఇంత హై రేంజ్ లో ప్రభాస్ సినిమా ఒక్క నైజాం ఏరియా అమ్ముడుపోవటం ఒక రికార్డు అని అంటున్నారు. నైజాం నవాబ్ ప్రభాస్ అని సాంఘీక మాధ్యమాల్లో వైరల్ కూడా అవుతోంది.
తెలుగు చిత్ర పరిశ్రమ నుండి ఇప్పుడు చాలామంది నటుల పేర్లు ఇప్పుడు ప్రపంచం అంతా వినిపిస్తోంది. తెలుగు సినిమాలు కూడా ప్రపంచం అంతా ఆడటమే అనుకు కారణం, దానికి ఆద్యుడు ఎస్.ఎస్. రాజమౌళి (#SSRajamouli) అతను తీసిన 'బాహుబలి' (#Baahubali) సినిమా అయితే, అందులో నటించిన ప్రభాస్ (#Prabhas) ఇప్పుడు భారతదేశ అగ్ర నటుల్లో ఒకడు అయ్యాడు. అందరి కళ్ళు ఇప్పుడు ప్రభాస్ పైనే వున్నాయి. ఎందుకంటే ముచ్చటగా మూడు పెద్ద సినిమాలు, అదీ గ్లోబల్ మార్కెట్ ని అతలాకుతలం చెయ్యగల సినిమాలు, అతని చేతిలో వున్నాయి.
మొదటిది 'ఆదిపురుష్' (#Adipurush) అయితే, రెండో సినిమా 'సలార్' (#Salar). ఇంక మూడో సినిమా నాగ్ అశ్విన్ (#NagAshwin) దర్శకత్వం వహిస్తున్న 'ప్రాజెక్ట్ కె' (#ProjectK). ఈ 'ప్రాజెక్ట్ కె' నైజాం ఏరియా డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఇంతకీ అమ్ముడు పోయాయో తెలిస్తే ఒక్కసారి షాక్ అవుతారు. అక్షరాలా 70 కోట్లకు (70 crores) అమ్ముడు పోయాయని తెలిసింది. అంటే ప్రభాస్ క్రేజ్ ఎంత ఉందొ అర్థం అవుతోంది. ఇంత హై రేంజ్ లో ప్రభాస్ సినిమా ఒక్క నైజాం ఏరియా అమ్ముడుపోవటం ఒక రికార్డు అని అంటున్నారు. నైజాం నవాబ్ ప్రభాస్ అని సాంఘీక మాధ్యమాల్లో వైరల్ కూడా అవుతోంది. అదీ కాకుండా ప్రభాస్ ముందు రెండు సినిమాలు అంత పెద్దగా బాక్స్ ఆఫీస్ వద్ద నడవకపోయినా కూడా, అతని సినిమా ని ఈ రేంజ్ లో ఒక్క వారికి కొన్నారు అంటే ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అని తెలుస్తోంది.
ఆసక్తికరం ఏంటి అంటే, ప్రభాస్ కి సంబంధించి ఈ మూడు సినిమాలు ఏడు నెలల వ్యవధిలో విడుదల అవుతున్నాయి. 'ఆదిపురుష్' (#Adipurush) జూన్ 16 విడుదల అవుతుంటే, 'సలార్' సెప్టెంబర్ 28 న వస్తోంది. 'ప్రాజెక్ట్ కె' (#ProjectK) మాత్రం 2024 సంక్రాంతి బరిలో వుంది. జనవరి 12న (January 12) విడుదల అవుతుంది అని అంటున్నారు. ఈ విడుదల తేదీలు ఇలా ఖరారు చేసినా, అవన్నీ మళ్ళీ మారే అవకాశం కూడా లేకపోలేదు, ఎందుకంటే అవన్నీ సినిమా పూర్తి అయినా తరువాత తెలుస్తుంది, అలాగే అప్పటి పరిస్థితుల వలన అదే తేదీల్లో రావచ్చు, మారొచ్చు కూడా.
Updated Date - 2023-02-23T15:19:28+05:30 IST