ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Recurring Dreams: కొందరికి పదే పదే ఒకే రకమైన కల.. అసలు ఎందుకు అలా రిపీట్ అవుతుందో తెలిస్తే..!

ABN, First Publish Date - 2023-10-17T10:38:48+05:30

సాధారణంగా వచ్చే కలలను పెద్దగా పట్టించుకోరు కానీ ఒకే విధమైన కల పదేపదే రిపీట్ అవుతుంటే మాత్రం చాలా గందరగోళానికి గురవుతారు. ఈ కలలకు కారణాలు ఈ ఐదే..

కలలు వాస్తవ ప్రపంచానికి భిన్నంగా అనిపిస్తాయి. చాలా విచిత్రంగా ఉంటాయి. నిద్రపోయిన తరువాత ప్రతి ఒక్కరికి కలలు వస్తాయి. కానీ ఉదయం లేవగానే తాము కన్న కలల గురించి బాగా గుర్తుండేది మాత్రం కొందరికే. కలలో జరగిన సంఘటనలు ప్రతి ఒక్కరూ అనుభూతి చెందుతారు, దాని ప్రభావం గంటల నుండి రోజుల పాటు ఉంటుంది. కలలు తమకు ఏదో చెప్పాలని చూస్తాయని, కలలు మనిషి మానసిక పరిస్థితిని తెలియజేస్తాయని కలల పరిశోధకులు చెబుతున్నారు. సాధారణంగా వచ్చే కలలను పెద్దగా పట్టించుకోరు కానీ ఒకే విధమైన కల పదేపదే రిపీట్ అవుతుంటే మాత్రం చాలా గందరగోళానికి గురవుతారు. కొండమీద నుండి పడిపోవడం, నీటి మీద నడవడం, ప్రవాహంలో కొట్టుకుపోవడం, నిండుగా పండ్లున్న చెట్టు కనిపించడం, పక్షులు, జంతువులు కనిపించడం ఇలా కలల ప్రపంచానికి హద్దులేదు. అయితే పదే పదే కలలు(recurring dreams) రావడానికి 5కారణాలు ఉన్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. వీటి గురించి తెలుసుకుంటే కలలు కూడా అర్థమవుతాయి.

సమస్యలు పరిష్కారం కాకపోవడం..(problems)

వెంటాడే కలలు జీవితంలో సమస్యలకు అద్దంలాంటివి. ఇష్టమైన వారితో విబేధాలు, అపరాధం, విచారం వంటివి మనసులో ఉండిపోయినప్పుడు, వారితో సమస్య పరిష్కారం కానప్పుడు పదేపదే కలలు రిపీటెడ్ గా వస్తుంటాయి. ఎత్తునుండి పడిపోవడానికి ప్రయత్నించడం వంటి కలలు జీవితంలో వైఫల్యాలను ఎత్తిచూపుతుంది. వాస్తవిక జీవితంలో విజయం లభించకపోగా వైఫల్యంలోకి జారిపోతున్న భావన కలిగిస్తుంది.

Viral News: ఈ ఫొటోలోని యువతి తండ్రికి ఏకంగా రూ.24,980 కోట్ల ఆస్తి.. అయినా ఈమె ప్రస్తుతం ఏం చేస్తోందో తెలిస్తే..!



ఒత్తిడి, ఆందోళన..(stress and anxiety)

ఒత్తిడి, ఆందోళన సమస్యలున్నవారి కలలు కూడా అలాగే ఉంటాయి. కలలో పరిగెడుతున్నట్టు, ఎవరో వెంబడిస్తున్నట్టు, కిందకు పడిపోతూ మళ్లీ లేవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు కలలు వస్తుంటే అది ఒత్తిడికి సంకేతం. ఈ కలలు ఆందోళన కలిగించడం వల్ల నిద్ర మధ్యలో ఉలిక్కిపడేలా చేస్తుంటాయి. అప్పటికే ఉన్న ఆందోళనను ఇవి మరింత పెంచుతాయి.

ట్రామా.. PTSD(పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్)..

జీవితంలో బాధాకరమైన సంఘటనలు ఎదుర్కొన్నవారు, అన్యాయానికి గురైనవారు, ప్రమాదకారణంగా పెద్ద గాయాలకు లోనైనవారికి పదే పదే పీడకలలు వస్తుంటాయి. ఈ పీడకలలు చాలా స్పష్టంగా గుర్తుంటాయి. నిద్రలో ఉలిక్కిపడి లేచిన వెంటనే కలల తాలూకూ భయం, ఆందోళన వారిని మరింత సంఘర్షణలోకి నెట్టేస్తుంది. గతంలో జరిగిన విషయాలు పదే పదే కలల రూపంలో వేధిస్తుంటాయి.

పదేపదే చేసే ఆలోచనలు..(repeated thoughts)

రోజువారి జీవితంలో మనుషులు ఎక్కువగా ఆలోచించే విషయాలను కలల రూపంలో అనుభూతి చెందుతుంటారు. ఎక్కువగా చేసే ఆలోచనలు, మనసులో ఉన్న భయాలు కలలరూపంలో ఆలోచింపజేస్తాయి. ఉదాహరణకు ప్రతిరోజూ ఉద్యోగరీత్యా ప్రయాణం చేసేవారు లోకల్ ట్రైన్ లేదా బస్ ఎక్కడ తప్పిపోతుందో అనే భయాన్ని మనసులో అనుభూతి చెందుతుంటే అవి కలల రూపంలో వెంటాడుతాయి. ఇవి ఆత్మపరిశీలనకు దారితీస్తాయి. అనవసరపు భయాలనుండి బయటకు వచ్చే దిశగా ఆలోచన కలిగిస్తాయి.

తీరని కోరికలు..(unmet desires)

జీవితంలో ప్రతి ఒక్కరికి కొన్ని అసాధ్యమైన కోరికలు ఉంటాయి. ఈ కోరికలు మనిషి జీవితంలో అసంతృప్తిని మిగులుస్తాయి. ఈ అసంతృప్తి కలల రూపంలో వెంటాడుతుంది. గాలిలో ఎగురుతున్నట్టు, అలా ఎగరడానికి ప్రయత్నిస్తున్నట్టు ఎవరైనా కలలు కంటే వారు జీవితంలో స్వేచ్చ కోసం, విముక్తి కోసం ఆరాటపడుతున్నవారు అని అర్థం. ఇలా కలలు వివిధరకాలుగా వ్యక్తుల మీద ప్రభవం చూపిస్తాయి.

Travelers: తరచూ ప్రయాణాలు చేసే అలవాటు ఉన్న వాళ్లు.. ఈ 10 వస్తువులను మాత్రం అస్సలు మర్చిపోరట..!


Updated Date - 2023-10-17T10:38:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising