టర్కీలో భూకంపం రాబోతోందని ముందే చెప్పిన శాస్త్రవేత్త నోట సంచలన కామెంట్స్.. భారత్‌కు కూడా పొంచి ఉన్న ముప్పు..?
ABN, First Publish Date - 2023-02-11T14:27:42+05:30
టర్కీ, సిరియా భూకంపాలను కచ్చితంగా అంచనా వేసి రెండ్రోజులు ముందే చెప్పిన నెదర్లాండ్స్ పరిశోధకుడి తాజా అంచనా ఆందోళన కలిగిస్తోంది. భారత్‌తో పాటు పలు ఆసియా దేశాల్లో భూంకపాలు సంభవించనున్నాయని ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈరోజు కాకపోతే రేపు.. లేకపోతే తర్వాతి రోజు టర్కీ, జోర్డాన్, సిరియా, లెబనాన్‌లలో 7.5 తీవ్రతతో భూకంపం వస్తుంది
.. ఈ నెల నాలుగో తేదీన నెదర్లాండ్స్ పరిశోధకుడు ఫ్రాంక్ హోగర్‌బీట్స్ చేసిన ట్వీట్ ఇది.. సరిగ్గా రెండు రోజుల తరువాత, ఫిబ్రవరి 6వ తేదీ ఉదయం 4 గంటలకు టర్కీ, సిరియాలో (Turkey earthquake) 7.8 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఈ భూకంపం కారణంగా ఇప్పటివరకు 21 వేల మందికి పైగా మరణించారు. క్షతగాత్రుల సంఖ్య 64 వేలకు చేరువైంది. తాజాగా ఆయన అంచనా వింటే గుండెలు గుభేలుమంటున్నాయి. ఎందుకంటే భారత్‌కు (India) భూకంప ముప్పు పొంచి ఉందని ఆయన చెబుతున్నారు.
టర్కీ భూకంపాన్ని అంచనా వేసిన ఫ్రాంక్ హోగార్‌బీట్స్ (Netherlands researcher Frank Hogerbeets) తాజాగా భారత్‌పై కూడా అదే వాదనను వినిపించారు. ఒక వీడియోలో ఫ్రాంక్ మాట్లాడుతూ, రాబోయే కొద్ది రోజుల్లో, ఆసియాలోని (Asia) వివిధ ప్రాంతాలలో భూగర్భ కదలికలు జరిగే అవకాశం ఉంది. ఈ కదలికలు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, హిందూ మహాసముద్రం పశ్చిమ భాగంలో ఉండే అవకాశం ఉంది. భారత్‌కు కూడా ప్రమాదం ఉంటుంది. అలాగే రాబోయే కొద్ది రోజుల్లో చైనాలో భూకంపం సంభవించవచ్చు
అని ఫ్రాంక్ పేర్కొనడం ఆందోళన రేపుతోంది. ఫ్రాంక్ మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (India at risk of massive earthquake)
Viral Video: తల్లి వయసున్న ఆంటీకి ఐ లవ్యూ
చెప్పిన కుర్రాడు.. ఆమె రియాక్షన్ ఏంటంటే..
భూ కంపాలను ఖచ్చితంగా అంచనా వేయడం సాధ్యమేనా?
సౌర వ్యవస్థ, వాతావరణం గణనల ఆధారంగా భూకంపాలను అంచనా వేయవచ్చని ఫ్రాంక్ చెబుతున్నారు. సౌర వ్యవస్థ నిర్దిష్ట స్థానం కారణంగా 6 కంటే ఎక్కువ తీవ్రత గల భూకంపాలు సంభవిస్తాయని ఆయన నమ్ముతారు. సౌర వ్యవస్థలో ఉన్న గ్రహాలు, చంద్రుడు ఒక నిర్దిష్ట స్థానానికి చేరుకున్నప్పుడు, అధిక తీవ్రత గల భూకంపాలు ఎక్కువగా సంభవిస్తాయని పేర్కొన్నారు. అయితే ఫ్రాంక్ అంచనా వంద శాతం నిజమవుతాయనే భయాలు అక్కర్లేదని నిపుణులు చెబుతున్నారు. భూకంపాలను కచ్చితంగా అంచనా వేయగలిగేది అవి సంభవించే 10 సెకెన్ల ముందు మాత్రమేనని చెబుతున్నారు.
Updated Date - 2023-02-11T15:47:09+05:30 IST