Rishab Shetty: ‘కాంతార 2’పై కీలక విషయాలు వెల్లడించిన రిషబ్ శెట్టి

ABN, First Publish Date - 2023-02-06T20:43:11+05:30

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి (Rishab Shetty) హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ‘కాంతార’ (Kantara). సప్తమి గౌడ హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. వరల్డ్ వైడ్‌గా రూ.400కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

Rishab Shetty: ‘కాంతార 2’పై కీలక విషయాలు వెల్లడించిన రిషబ్ శెట్టి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి (Rishab Shetty) హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ‘కాంతార’ (Kantara). సప్తమి గౌడ హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. వరల్డ్ వైడ్‌గా రూ.400కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ‘కాంతార 2’ (Kantara 2) ఉంటుందని హోంబలే ఫిలిమ్స్ అధినేత విజయ్ కిరంగదూర్ (Vijay Kirgandur) కొన్నాళ్ల క్రితమే చెప్పారు. రిషబ్ శెట్టి ఇప్పటికే స్క్రిఫ్ట్‌పై పనిచేయడం మొదలుపెట్టారని పేర్కొన్నారు. తాజాగా రిషబ్ కూడా ‘కాంతార’ కు సంబంధించిన ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నారు.

‘కాంతార 2’ స్క్రిఫ్ట్ పనులు ఇప్పటికే మొదటి పెట్టినట్టు రిషబ్ శెట్టి తెలిపారు. అది సీక్వెల్ కాదని ప్రీక్వెల్ అని చెప్పారు. తొలి భాగం ఎక్కడైతే ప్రారంభమైందో.. దానికి ముందు జరిగిన సంఘటనలను రెండో భాగంలో చూపించనున్నట్టు పేర్కొన్నారు. పంజుర్లికి సంబంధించిన సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయని వెల్లడించారు. ‘కాంతార’ రెండో భాగం 2024లో విడుదలవుతుందని స్పష్టం చేశారు. ‘కాంతార’ ప్రీక్వెల్‌లో గ్రామస్తుల మధ్య అనుబంధాలు, గుళిగ దైవం, రాజు గురించి చూపిస్తామని విజయ్ కిరంగదూర్ అన్నారు. గ్రామస్తులతో పాటు భూమిని రక్షించడానికి రాజు ఏం చేశాడనేది తెర మీద ఆవిష్కరిస్తామన్నారు. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల కోసం వర్షాధారిత వాతావరణం అవసరమన్నారు. ‘కాంతార’ సినిమా మొదటగా కన్నడలో విడుదలయింది. అనంతరం సంచలన విజయం సాధించడంతో తెలుగు, తమిళ్, మలయాళం, హిందీలోకి మేకర్స్ డబ్ చేశారు. ఈ మూవీ విడుదలైనప్పటి నుంచి రికార్డులను తిరగరాయడమే పనిగా పెట్టుకుంది. ఐఎమ్‌డీబీలో అత్యధిక రేటింగ్‌ను సాధించిన చిత్రంగా నిలిచింది.

Updated Date - 2023-02-06T21:02:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising