ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kantara: ట్విస్ట్ మామూలుగా లేదు.. ఆస్కార్‌ బరిలో ‘కాంతారా’

ABN, First Publish Date - 2023-01-10T13:19:39+05:30

గతేడాది పలు సౌతిండియా సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో అలరించిన విషయం తెలిసిందే.

Kantara
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గతేడాది పలు సౌతిండియా సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో అలరించిన విషయం తెలిసిందే. అందులో.. ‘ఆర్ఆర్ఆర్’ (RRR), ‘కేజీయఫ్ ఛాప్టర్ 2’, ‘కాంతారా’ (Kantara)తో పాటు పలు చిత్రాలు ఉన్నాయి. వీటిలో ‘కాంతారా’ అయితే ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. హోంబలే ఫిల్స్మ్ నిర్మించిన ఈ చిత్రంలో రిషబ్ శెట్టి (Rishab Shetty) హీరోగా నటించడంతోపాటు దర్శకత్వం వహించాడు. కేవలం రూ.16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.400 కోట్ల వసూళ్లు సాధించింది.

కర్ణాటకలోని మంగుళూరుకి చెందిన ‘భూతకోల’ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు కనెక్ట్ అయిపోయారు. ముఖ్యంగా సినిమా చివరి 20 నిమిషాల్లో రిషబ్ శెట్టి నటనకి ముగ్ధులయి పోయారనే చెప్పాలి. దీంతో ఎటువంటి ప్రచారం లేకుండా కేవలం మౌత్ టాక్‌తోనే మంచి విజయాన్ని సాధించింది. తాజాగా ఈ సినిమా మరో ఘనత సాధించింది. అది కూడా చాలా సైలెంట్‌గా.

‘ఆస్కార్’ (Oscar) అవార్డులకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ తెలిసిందే. ప్రతి మూవీ టెక్నిషియన్ ఒక్కసారైనా ఆ అవార్డుని అందుకోవాలని ఊవ్విళ్లూరుతారు. ‘ఆస్కార్ 2023’కి ‘కాంతారా’ సినిమా రెండు విభాగాల్లో కంటెస్టెషన్ లిస్ట్‌లో చోటు సాధించింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు విభాగాల్లో టాప్ 15 జాబితాలో ఈ చిత్రం నిలిచింది. టాప్ 5లో నిలుస్తుందో లేదో చూడాలి. ఈ విషయాన్ని తెలుపుతూ.. ‘కాంతారా’ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేసింది.

అందులో.. ‘‘కాంతారా’కి 2 ఆస్కార్‌ అర్హతలు లభించినందుకు ఆనందంగా ఉంది! మాకు మద్దతుగా నిలిచిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి మద్దతుతో ఈ ప్రయాణాన్ని పంచుకోవడం సంతోషంగా ఉంది.ఆస్కార్‌‌లో మెరవడానికి ఎదురుచూస్తున్నాం’ అని రాసుకొచ్చింది. కాగా.. ఇప్పటి వరకూ గుజరాతీ చిత్రం ‘ది ఛెల్లో షో’, టాలీవుడ్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ మాత్రమే ఆస్కార్ బరిలో ఉన్నాయని అందరూ అనుకున్నారు. సడెన్‌గా ఈ లిస్ట్‌లో ‘కాంతారా’ చేరడం విశేషం.

Updated Date - 2023-01-10T13:57:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising