Ritika singh: విపరీతంగా ఏడ్చేశా.. ఎందుకంటే..

ABN, First Publish Date - 2023-03-03T16:48:32+05:30

‘గురు’ (Guru movie) సినిమాతో ఆకట్టుకున్నారు రితికా సింగ్‌9Ritika singh) ప్రస్తుతం తమిళంలో వరుస చిత్రాలు చేస్తున్నారు. తాజాగా ఆమె బాలీవుడ్‌లో నటించిన ‘ఇన్‌కార్‌’(Incar) చిత్రం విడుదలైంది.

Ritika singh: విపరీతంగా ఏడ్చేశా.. ఎందుకంటే..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

‘గురు’ (Guru movie) సినిమాతో ఆకట్టుకున్నారు రితికా సింగ్‌9Ritika singh) ప్రస్తుతం తమిళంలో వరుస చిత్రాలు చేస్తున్నారు. తాజాగా ఆమె బాలీవుడ్‌లో నటించిన ‘ఇన్‌కార్‌’(Incar) చిత్రం విడుదలైంది. యథార్థ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఐదు భాషల్లో విడుదలైంది. ఈ సందర్భంగా రితికా మీడియాతో మాట్లాడారు. ఈ చిత్రం తనకెంతో ప్రత్యేకమన్నారు.

‘‘ఒకే రోజులో జరిగే కథ ఇది. ఓ అమ్మాయిని సాయంత్రం సమయంలో కిడ్నాప్‌ చేస్తారు. రాత్రి సమయానికల్లా తనకు ఏం జరిగింది.. కిడ్నాపర్ల నుంచి బయటపడిందా లేదా? అనేది కథ. సినిమా ప్రారంభంలో ఏ కాస్ట్యూమ్స్‌ వేసుకున్నానో.. చివరి వరకూ వాటితోనే కనిపించాలి. దాని కోసం ఎంతో కష్టపడ్డాను. సాక్షి గులాటీ పాత్రకు చాలా కనెక్ట్‌ అయ్యా. ఓ సన్నివేశం చిత్రీకరణ తర్వాత దర్శకుడు కట్‌ చెప్పగానే విపరీతంగా ఏడ్చేశాను. ఎందుకంటే ఆ సన్నివేశంలో నా పాత్రను అందరూ తిడతారు. దానిని నేను భరించలేకపోయాను. అది నాకు చాలా కష్టంగా అనిపించింది. అందుకే షూటింగ్‌ అయ్యాక.. కారు దిగి కాసేపు ఒంటరిగా గడిపాను’’ అని తెలిపారు. (RItika emotional about INCAR movie)

Updated Date - 2023-03-03T16:48:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!