ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Selfie New Rule: ఇక్కడ సెల్ఫీ తీసుకుంటే ఏకంగా రూ.24 వేలు జరిమానా.. ఈ 5 ప్రాంతాల్లో సెల్ఫీలపై నిషేధం..!

ABN, First Publish Date - 2023-05-01T14:53:41+05:30

ప్రస్తుతం ఎక్కడకు వెళ్లినా సెల్ఫీలు (Selfies) తీసుకోవడం అనేది కామన్ అయిపోయింది. ప్రత్యక్షంగా అనుభూతిని ఆస్వాదించడం కాకుండా సెల్ఫీలు తీసుకుని భద్రపరచుకోవాలని అందరూ అనుకుంటున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుతం ఎక్కడకు వెళ్లినా సెల్ఫీలు (Selfies) తీసుకోవడం అనేది కామన్ అయిపోయింది. ప్రత్యక్షంగా అనుభూతిని ఆస్వాదించడం కాకుండా సెల్ఫీలు తీసుకుని భద్రపరచుకోవాలని అందరూ అనుకుంటున్నారు. అయితే అన్ని చోట్లా సెల్ఫీలు తీసుకుంటే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. భారత్‌తో పాటు ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో సెల్ఫీలు తీసుకుంటే భారీ మూల్యం చెల్లించాల్సి రావచ్చు (Selfie ban). గుజరాత్‌లో ఉన్న ఏకైక హిల్ స్టేషన్ దంగ్‌ ( Dang)లో సెల్ఫీలు నిషేధం. అక్కడ సెల్ఫీ తీసుకుంటే దాదాపు రూ.24 వేలు జరిమానా కట్టాల్సి ఉంటుంది.

భారత్‌లోని ప్రముఖ టూరిస్ట్ స్పాట్ అంటే అందరికీ మొదట గుర్తుకొచ్చేది గోవా (Goa). గోవాలోని బీచ్‌లంటే చాలా మంది ఇష్టపడతారు. అక్కడ సముద్ర తీరాల్లో సెల్ఫీల కోసం వెళ్లి చాలా మంది చనిపోయారు. దీంతో స్థానిక యంత్రాంగం గోవాలోని బీచ్‌లలో సెల్ఫీలను నిషేధించింది. అలాగే జపాన్‌లోని (Japan) పబ్లిక్ రైళ్లలో కూడా సెల్ఫీలు నిషేధం. సెల్ఫీ స్టిక్‌లు ఉపయోగించడం మరింత నేరం. సెల్ఫీలు తీసుకునే వారి వల్ల ఇతరులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకే రైల్ నెట్‌వర్క్ ఈ నిర్ణయం తీసుకుంది.

Viral Video: చదువు కోసం ప్రాణాలు పణంగా పెడుతున్న విద్యార్థినులు.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో!

టవర్ ఆఫ్ లండన్‌లో (Tower of London) కూడా సెల్ఫీలు నిషేధం. ఇక, లండన్‌లోని రాయల్ జ్యూయలరీ హౌస్‌లన్నింటిలోనూ సెల్ఫీలు నిషేధం. రాయల్ ట్రెజరీ సెక్యూరిటీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. స్పెయిన్‌లో (Spain) జరిగే ప్రఖ్యాత బుల్స్ రేస్ ఈవెంట్‌లో (Bulls event) కూడా సెల్ఫీలు తీసుకోవడం నిషేధం. బుల్స్ రేస్ సమయంలో ప్రమాదాలను నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే దాదాపు 2.7 లక్షల రూపాయల జరిమానా కట్టాల్సి ఉంటుంది.

Updated Date - 2023-05-01T14:53:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising