Salman Khan: మైత్రీ మూవీ మేకర్స్‌తో సినిమా!

ABN, First Publish Date - 2023-01-28T15:26:03+05:30

బాలీవుడ్‌ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan). యూత్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతడి నుంచి సినిమా వస్తుందంటే చాలు అభిమానులందరు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.

Salman Khan: మైత్రీ మూవీ మేకర్స్‌తో సినిమా!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan). యూత్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతడి నుంచి సినిమా వస్తుందంటే చాలు అభిమానులందరు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అందుకే బాలీవుడ్ భాయ్‌జాన్‌ డేట్స్ కోసం నిర్మాతలందరు లైన్ కడతారు. అయితే, సల్మాన్ ఖాన్ టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్‌కు డేట్స్ ఇచ్చాడని ఫిల్మ్ నగర్‌లో రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. ఈ ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కనుందని సమాచారం అందుతుంది.

టాలీవుడ్‌లోని టాప్ ప్రొడక్షన్ హౌసెస్‌లో మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ఒకటి. ఈ బ్యానర్‌ను నవీన్ యెర్నెనీ, వై. రవి శంకర్, మోహన్ చెరుకూరి 2015లో స్థాపించారు. ఈ నిర్మాణ సంస్థ చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలందరితో సినిమాలు చేసింది. అతి త్వరలోనే సల్మాన్ ఖాన్ తోను మూవీ చేయనుందని సమాచారం అందుతుంది. బీ టౌన్‌లో ఈ సంస్థకు ఇది రెండో ప్రాజెక్టు కానుందని వదంతులు షికార్లు కొడుతున్నాయి. ఈ సంస్థ ఇప్పటికే ‘పఠాన్’ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ (Siddharth Anand), ప్రభాస్ కాంబినేషన్‌ను మొదటి ప్రాజెక్టుగా సెట్ చేసుకుంది. సంక్రాంతి సందర్భంగా మైత్రీ మూవీస్ నుంచి ‘వీరసింహా రెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలు వచ్చాయి. ఈ రెండుచిత్రాలు బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టాయి. మైత్రీ మూవీ మేకర్స్ నుంచి భవిష్యత్తులో ‘పుష్ప 2’ (Pushpa 2), ‘ఎన్టీఆర్ 31’, ‘ఆర్‌సీ 16’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి సినిమాలు రానున్నాయి.

Updated Date - 2023-01-28T16:16:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising