Samantha: శకుంతలగా మెప్పించిందా, దర్శకుడు ఏమన్నారో తెలుసా ...
ABN, First Publish Date - 2023-02-15T16:15:37+05:30
దుర్వాసుడి శాపం కారణంగా దుష్యంతుడి వారి ప్రేమకు, గాంధర్వ వివాహానికి గుర్తుగా ఇచ్చిన ఉంగరాన్ని పోగొట్టుకుంది శకుంతల. శాపం కారణంగా దుష్యంతుడు కూడా తన భార్యను మరచిపోతాడు. అలాంటి పరిస్థితుల్లో అసహాయురాలైన ఆమె ఏం చేస్తుంది?
‘మధుర గతమా
కాలాన్నే ఆపకా
ఆగావే సాగకా
అంగుళికమా
జాలైనా చూపకా
చేజారావే వంచికా..’’
అని దుష్యంతుడికి దూరమైన శకుంతల మనసులోని బాధను పాట రూపంలో వ్యక్తం చేస్తుంది. దుర్వాసుడి శాపం కారణంగా దుష్యంతుడి వారి ప్రేమకు, గాంధర్వ వివాహానికి గుర్తుగా ఇచ్చిన ఉంగరాన్ని పోగొట్టుకుంది శకుంతల. శాపం కారణంగా దుష్యంతుడు కూడా తన భార్యను మరచిపోతాడు. అలాంటి పరిస్థితుల్లో అసహాయురాలైన ఆమె ఏం చేస్తుంది? శకుంతల మనసుకి తగిలిన గాయాన్ని కాలం ఎలా మాన్పించింది అనే విషయాలు తెలుసుకోవాలంటే ‘శాకుంతలం’ (Shakuntalam) సినిమా చూడాల్సిందే అని అంటున్నారు ఆ చిత్ర దర్శకుడు గుణ శేఖర్ (Director Gunasekhar).
'శాకుంతలం' (#Shakuntalam) సినిమా గుణశేఖర్ దర్శకత్వంలో 3D టెక్నాలజీతో ఒక విజువల్ వండర్‌గా ఈ పౌరాణిక ప్రేమ కథా చిత్రాన్ని తీశామని చెపుతున్నారు. దుష్యంత మహారాజుగా దేవ్ మోహన్ (Dev Mohan) నటించగా, శకుంతల పాత్రలో అగ్రనటి అయిన సమంత (#Samantha) అందులో ఒదిగిపోయింది అని దర్శకుడు చెప్తున్నారు. ఇది పాన్ ఇండియా చిత్రంగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏప్రిల్ 14న (#ShakuntalamOnApril14) విడుదల అవుతోంది.
దర్శకుడు గుణ శేఖర్, భారతం లో వచ్చిన 'దుష్యంతోపాఖ్యానం' నుండి కాకుండా, మహాకవి కాళిదాసు (Mahakavi Kalidasu) రచించిన 'అభిజ్ఞాన శాకుంతలం' (Abhijnana Shakuntalam) నుండి ఈ కథను తీసుకొని దాన్ని ప్రేమ కావ్యంగా మలిచినట్టు తెలుస్తోంది. దుష్యంతుడు, శకుంతల ప్రేమను కవి కాళిదాసు అద్భుతంగా వర్ణిస్తారు, దానికి ధీటుగా ఇప్పుడున్న సాంకేతిక విలువలతో, ప్రతి సన్నివేశాన్ని కన్నుల పండుగగా తెరకెక్కించారు దర్శకుడు గుణ శేఖర్ అని చెప్తున్నారు.
మంగళ వారం ఈ సినిమా నుండి ఈ విరహ గీతం ‘మధుర గతమా..’ అనే పాటను విడుదల చేశారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ (Mani Sharma) సంగీతం అందించారు. ఈ పాటను శ్రీమణి రాయగా, అర్మాన్ మాలిక్ (Armaan Malik), శ్రేయా ఘోషల్ (Shreya Ghoshal) పాడారు.
Updated Date - 2023-02-15T16:15:39+05:30 IST