ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sandeep Reddy Vanga: ‘యానిమల్’ సెట్ నుంచి వీడియో లీక్.. వైరల్..

ABN, First Publish Date - 2023-01-29T18:46:26+05:30

‘అర్జున్ రెడ్డి’ (Arjun reddy) కి దర్శకత్వం వహించి టాలీవుడ్‌ను షేక్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga). ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘అర్జున్ రెడ్డి’ (Arjun reddy) కి దర్శకత్వం వహించి టాలీవుడ్‌ను షేక్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga). ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ మూవీ ఇచ్చిన జోష్‌తో అర్జున్ రెడ్డి హిందీ వెర్షన్‌ ‘కబీర్ సింగ్’ (Kabir Singh) ను సందీప్ తెరకెక్కించాడు. ఈ సినిమా బాలీవుడ్‌లోను బంపర్ హిట్ కొట్టింది. అతడు తాజాగా ‘యానిమల్’ (Animal)కు దర్శకత్వం వహిస్తున్నాడు. రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) హీరోగా నటిస్తున్నాడు. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతుంది. ‘యానిమల్’ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ మూవీ భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది. హిట్ డైరెక్టర్ నుంచి వస్తున్న ప్రాజెక్టు కావడంతో సినిమాపై భారీ బజ్ ఉంది. దీంతో సెట్స్ నుంచి పిక్స్, వీడియోలు వరుసగా లీక్ అవుతున్నాయి.

‘యానిమల్’ సెట్ నుంచి తాజాగా ఓ వీడియో లీక్ అయింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో రణ్‌బీర్ నీలం రంగు సూట్ ధరించాడు. పొడవైన జుట్టు, గుబురు గడ్డంతో కనిపించాడు. సిగరెట్‌ను కాలుస్తున్నాడు. కారు డిక్కీ‌లో గన్స్ కనిపించాయి. ‘కబీర్ సింగ్’ తెరకెక్కించినప్పుడు సందీప్‌పై తీవ్రమైన విమర్శలొచ్చాయి. హింస ప్రవృత్తిని ప్రోత్సహిస్తున్నాడని అనేక మంది విమర్శించారు. అప్పట్లో సందీప్ ఇంటర్వ్యూ ఇస్తూ హింస అంటే ఏంటో తన తర్వాతి సినిమాలో చూపిస్తానన్నాడు. అందుకు తగ్గట్టుగానే ఫస్ట్ లుక్‌ను విడుదల చేశాడు. ప్రస్తుతం లీకైన వీడియోను బట్టి అదే విషయం సుస్పష్టం అవుతుంది. ‘యానిమల్’ పాన్ ఇండియాగా రూపొందుతుంది. పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్, బిపిన్ కర్కి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Updated Date - 2023-01-29T18:49:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising