ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Women Teacher's Day : వారికోసమే టీచరమ్మ అయింది..!

ABN, First Publish Date - 2023-01-03T12:07:54+05:30

సావిత్రీబాయి మహారాష్ట్రలోని పూణేలో బాలికల కోసం మొదటి భారతీయ పాఠశాలను ప్రారంభించింది.

Savitribai Phule
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సావిత్రీబాయి ఫూలే (Savitribai Phule) భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా, స్త్రీవాదిగా, కుల వ్యవస్థ నిర్మూలనకు కృషి చేసిన సంఘ సంస్కర్త, పరోపకారి, శిశుహత్యా వ్యతిరేక ఉద్యమకారిణి అంతేకాదు కవయిత్రి కూడా. తన భర్త, జ్యోతిబా ఫూలే(Jyotiba Phule)తో కలిసి, సావిత్రీబాయి మహారాష్ట్రలోని పూణేలో బాలికల కోసం మొదటి భారతీయ పాఠశాలను ప్రారంభించింది. అప్పటి రోజుల్లో ఉన్నత కూలాల వారికి మాత్రమే పాఠశాలకు వెళ్ళి చదువుకునేందుకు వీలు ఉండేది. ఈ కారణంగా అంటరాని వారికి చదువుకునే అవకాశాలు తక్కువగా ఉండేవి. ఆ కారణంగానే సావిత్రిబాయి భర్త జ్యోతిబాతో కలసి అంటరాని బాలికల కోసం ఒక పాఠశాలను ప్రారంభించింది.

విద్య, ఆరోగ్యం, సామాజిక సంస్కరణలపై దృష్టి సారించి అట్టడుగు వర్గాలు, మహిళల అభ్యున్నతికి ఈ జంట గొప్పగా తోడ్పడింది. సావిత్రీబాయి వితంతు పునర్వివాహాల న్యాయవాది, బాల్య వివాహాల నిర్మూలన కోసం పోరాడారు. స్త్రీ విద్య, అభ్యున్నతికి ఆమె చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

జనవరి 3, 1831న మహారాష్ట్ర(Maharashtra)లోని సతారా జిల్లాలోని నైగావ్ గ్రామంలో జన్మించిన సావిత్రీబాయి నిమ్న కులానికి చెందినది కాబట్టి విద్యను అభ్యసించలేకపోయింది. ఆమెకు పదేళ్ల వయసులో జ్యోతిబా ఫూలేతో వివాహం జరిగింది, అతనికి అప్పటికి పదమూడేళ్లు. పిల్లలు లేనందువల్ల యశ్వంతరావు అనే అబ్బాయిని దత్తత తీసుకున్నారు. వివాహం తరువాత భార్యాభర్తలు ఇద్దరూ చదువుకున్నారు. జ్యోతిబా, సావిత్రీబాయి ఇద్దరూ విద్యను పొందడానికి చాలా శ్రమపడవలసి వచ్చింది. స్కాటిష్ మిషనరీ పాఠాశాలలో ఏడవ తరగతి వరకు జ్యోతిబా చదివాడు. సావిత్రీ బాయి ఇంటి వద్దే విద్యను అభ్యసించింది. తన విద్యను పూర్తి చేసిన తర్వాత, సావిత్రీబాయి పూణేలో జ్యోతిబా గురువు సగుణబాయితో కలిసి పిల్లలకు బోధించడం ప్రారంభించింది. గర్భిణీ వితంతువులు, అత్యాచార బాధితులకు సహాయం చేయడానికి బాల్హత్య ప్రతిబంధక్ గృహాన్ని ప్రారంభించారు, సావిత్రిబాయి, జ్యోతిబా తల్లులు వదిలేసిన అనాధ పిల్లలను కూడా సాకేవారు.

1848లో, పూణే(Pune)లోని భిదేవాడలో బాలికల కోసం ఒక పాఠశాలను ప్రారంభించారు. మొదటి తరగతిలో కేవలం తొమ్మిది మంది విద్యార్థులు మాత్రమే ఉండేవారు. వీరంతా నిమ్నకులానికి చెందినవారు. 1851 నాటికి, ఫూల్స్ బాలికల కోసం మూడు పాఠశాలలను ప్రారంభించారు, ఇందులో మొత్తం 150 మంది విద్యార్థులు చేరారు. వారి పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలల బోధన, పాఠ్యాంశాలలో మెరుగైన పేరును పొందాయి, దీని ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లోని మగ విద్యార్థుల కంటే వారి పాఠశాలల్లో ఎక్కువ మంది ఆడ విద్యార్థులు ఉండేవారు.

అయినప్పటికీ, అప్పటి ఛాందసవాదులు, సాంప్రదాయిక సమాజం ఈ జంటను బహిష్కరించింది. సావిత్రీబాయి బోధించడానికి వెళ్ళినప్పుడు ప్రజలు తరచుగా ఆమెపై పేడ, రాళ్ళు విసిరేవారు. నిరక్షరాస్యత సమాజం వారిని అణిచివేయాలని చూస్తే సావిత్రీబాయి ఒపికగా, సహనంతో వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేసింది. సావిత్రీబాయి రచించిన గో, గెట్ ఎడ్యుకేషన్ అనే కవిత అణచివేత నుండి విముక్తి పొందేందుకు అట్టడుగు కులాల వారు విద్యను అభ్యసించమని ప్రోత్సహించింది.

బుబోనిక్ ప్లేగు(Bubonic plague) మహమ్మారి మహారాష్ట్రలో కనిపించినప్పుడు, సావిత్రీబాయి క్లినిక్ ను ప్రారభించి పూణే శివార్లలో ప్లేగు వ్యాధితో బాధపడుతున్న ఎందరికో సేవచేసింది. ఈ సేవలను చేస్తూనే ఆమె ప్లేగు వ్యాధి సోకి 1897 మార్చి 10న మరణించింది

Updated Date - 2023-01-03T12:43:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising