ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

SBI: రూ.1300 కోసం ఆశపడిన ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్.. చివరకు ఉద్యోగమే ఊస్ట్.. అసలేం జరిగిందంటే..!

ABN, First Publish Date - 2023-09-26T15:14:50+05:30

ఉత్తపుణ్యానికి రోజుకు రూ.1300 వస్తుందని కక్కర్తి పడ్డ ఓ ఎస్బీఐ బ్యాంకు మేనేజర్ తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. హాటల్‌లో ఉన్నానంటూ తప్పుడు బిల్లులు కోరినట్టు బయటపడటంతో ఉన్నతాధికారులు అతణ్ణి తీసేశారు. హైకోర్టు కూడా బ్యాంకు నిర్ణయాన్నే సమర్థించింది.

ఇంటర్నెట్ డెస్క్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం.. అదీ మేనేజర్‌గా! అంతటి ఉన్నత స్థానంలో ఉండి ఓ వ్యక్తి కేవలం రూ.1300కు కక్కుర్తి పడ్డాడు. ఫలితంగా ఉద్యోగాన్నే పోగొట్టుకున్నాడు. ఇంత చిన్న తప్పుకు అంత పెద్ద శిక్ష అన్యాయమంటూ కోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. జీవితం తలకిందులైంది. చక్కని జీవితాన్ని చేతులారా నాశనం చేసుకున్న ఓ వ్యక్తి ఉదంతం ఇది.

పూర్తి వివరాల్లోకి వెళితే, ఓ వ్యక్తి 2009లో స్టేట్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా చేరాడు. అనంతరం 2011లో వెల్లూర్ జిల్లాలోని యెలగిరిలో ఉన్న అతవనూర్ బ్రాంచీ మేనేజర్‌గా బదిలీపై వెళ్లాడు. అయితే, ఈ క్రమంలో అతడు హోటల్‌లో ఐదు రోజుల పాటు ఉండాల్సి వచ్చిందంటూ బ్యాంకుకు కొన్ని ఫేక్ బిల్లులు (Fake bill) చూపించి రిఫండ్ కోరాడు. బ్యాంకు వారు ముందూ వెనుకా ఆలోచించకుండా అతడికి రిఫండ్ ఇచ్చేస్తారని అనుకున్నారు.


కానీ అతడి అంచనాలు ఊహించని విధంగా తలకిందులయ్యాయి. అతడిచ్చిన బిల్లులు నిజమైనవో కావో తేల్చేందుకు బ్యాంకు అధికారులు రంగంలోకి దిగి ఎంక్వైరీ చేస్తే మనోడి బండారం మొత్తం బయటపడింది. అతడు బిల్లుల్లో పేర్కొన్న హోటల్ అసలు లేనేలేదని తేటతెల్లమైంది. అంతేకాదు, తాను తీసుకున్నట్టు అతడు చూపెడుతున్న గదుల వాస్తవ రెంట్ కూడా రూ.880కి మించి ఉండదని బ్యాంకు వారికి తెలిసింది. దీంతో, బ్యాంకు క్రమశిక్షణ విభాగం అధికారి సదరు మేనేజర్ శాలరీ నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. కానీ, అతడిని ఉద్యోగం నుంచి తొలగించాలంటూ పైనుంచి ఆదేశాలు రావడంతో అతడు బంగారం లాంటి ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది(SBI bank manager loses job over fake hotel bills).


ఇలా అనూహ్యంగా ఉద్యోగం కోల్పోవడంతో ఆయన చివరకు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఇలాంటి ఘటనలో గతంలో ఉద్యోగులను తొలగించలేదన్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. తన ఉద్యోగం తనకు దక్కేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కోర్టును వేడుకున్నాడు. కానీ న్యాయస్థానం అతడి అభ్యర్థనను తాజాగా తోసిపుచ్చింది. ఇలాంటి ప్రవర్తనను ఏమాత్రం సహించకూడదని తేల్చి చెప్పింది. బ్యాంకు అధికారులే ఇలా అక్రమాలకు పాల్పడుతుంటే ప్రజలకు బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకం పోతుందని వ్యాఖ్యానించిన న్యాయస్థానం..బ్యాంకు అధికారులు అతడిని తొలగించడాన్ని సమర్థించింది. బ్యాంకు ఉద్యోగులు కట్టుతప్పకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నతాధికారుల మీద ఉందన్న న్యాయస్థానం.. అక్రమాలకు పాల్పడిన వారికి ఏ శిక్ష విధించాలనే స్వేచ్ఛ వారికి ఉంటుందని తేల్చి చెప్పింది.

Updated Date - 2023-09-26T15:21:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising