ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

SelfieeReview: మరో సౌత్ రీమేక్ మటాష్

ABN, First Publish Date - 2023-02-24T17:04:36+05:30

మాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన సినిమా ‘డ్రైవింగ్ లైసెన్స్’ (Driving license). ఈ చిత్రాన్ని హిందీలో ‘సెల్ఫీ’ (Selfiee) టైటిల్‌తో రీమేక్ చేశారు. బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్ (Akshay Kumar), ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) హీరోలుగా నటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన సినిమా ‘డ్రైవింగ్ లైసెన్స్’ (Driving license). ఈ చిత్రాన్ని హిందీలో ‘సెల్ఫీ’ (Selfiee) టైటిల్‌తో రీమేక్ చేశారు. బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్ (Akshay Kumar), ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) హీరోలుగా నటించారు. నుస్రత్ బరుచా (Nushrratt Bharuccha), డయనా పెంటీ (Diana Penty) హీరోయిన్ పాత్రలను చేశారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 24న విడుదల అయింది. అభిమానుల నుంచి నెగెటివ్ టాక్‌ను తెచ్చుకుంది.

‘సెల్ఫీ’ లో అక్షయ్ కుమార్ సినిమా హీరో పాత్రను పోషించారు. వెహికల్ ఇన్‌స్పెక్టర్, హీరో అభిమాని పాత్రలో ఇమ్రాన్ హష్మీ కనిపించారు. ఎంటర్‌టైన్ మెంట్‌ను కోరుకునేవారు ‘సెల్ఫీ’ (SelfieeReview)ని ఇష్టపడుతుంటే, కొత్త రకం సినిమాలను చూడాలని కోరుకునే వారు బాగా లేదని పోస్ట్‌లు పెడుతున్నారు. బాలీవుడ్ క్రిటిక్ కమల్ ఆర్. ఖాన్ (Kamaal R Khan) ‘సెల్ఫీ’ పై విమర్శల వర్షం కురిపించారు. అక్షయ్ కుమార్ వరుసగా 9వ ప్లాఫ్ ఇచ్చారని పేర్కొన్నారు. గత పదేళ్లలో ఇమ్రాన్ హష్మీ నుంచి ఒక్క యావరేజ్ సినిమా కూడా రాలేదని చెప్పారు. ఒరిజినల్ మలయాళం చిత్రమే బాగుందని ఓ నెటిజన్ చెప్పారు. అక్షయ్ కుమార్ స్టార్‌డమ్‌కు అనుగుణంగా మూవీని మార్చడం బాగా లేదని పేర్కొన్నారు. ‘సెల్ఫీ’ కి రాజ్ మెహతా దర్శకత్వం వహించాడు. అరుణ్ భాటియా, అపూర్వ మోహతా, హీరు యశ్ జోహార్, సుప్రియ మేనన్, కరణ్ జోహార్, పృథ్వీరాజ్ సుకుమారన్, అపూర్వ మెహతా తదితరులు నిర్మించారు.

బాలీవుడ్‌లో రీమేక్ అవుతున్న అనేక సౌత్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవుతున్నాయి. ‘హిట్’, ‘విక్రమ్ వేద’, ‘మిలీ’ తదితర చిత్రాలు ప్రేక్షకుల ఆదరణను దక్కించుకోలేక పోయాయి. తాజాగా విడుదల అయిన ‘షెహజాదా’, ‘సెల్ఫీ’ చిత్రాలు అదే బాటలో పయనించాయి.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Ranbir Kapoor: బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకునే అర్హత నాకు లేదు.. ‘పుష్ప’ లో అల్లు అర్జున్ అద్భుతంగా..

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Vishal: భారీ ప్రమాదం.. కొంచముంటే విశాల్ ప్రాణాలు పోయేవి.. వీడియో వైరల్

Nani: నెపోటిజానికి కారణం ప్రేక్షకులే..!

Updated Date - 2023-02-24T17:06:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising