Pathaan: ‘పెద్ద సమస్యే వచ్చి పడిందే.. చాలా కష్టపడాలి’.. చిన్నారికి షారుఖ్ రిప్లై అదుర్స్

ABN, First Publish Date - 2023-02-06T11:08:01+05:30

దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన తాజా చిత్రం ‘పఠాన్’ (Pathaan). యశ్ రాజ్ ఫిల్మ్ (YRF) నిర్మించిన ఈ చిత్రానికి సిద్దార్థ్ ఆనంద్..

Pathaan: ‘పెద్ద సమస్యే వచ్చి పడిందే.. చాలా కష్టపడాలి’.. చిన్నారికి షారుఖ్ రిప్లై అదుర్స్
Shah Rukh Khan
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన తాజా చిత్రం ‘పఠాన్’ (Pathaan). యశ్ రాజ్ ఫిల్మ్ (YRF) నిర్మించిన ఈ చిత్రానికి సిద్దార్థ్ ఆనంద్ (Siddharth Anand) దర్శకత్వం వహించాడు. జనవరి 25న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బాలీవుడ్ రికార్డులు అన్నింటినీ తిరగరాస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్ల వసూళ్లని సాధించింది.

ఈ తరుణంలో ఓ చిన్నారికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అందులో ‘పఠాన్’ సినిమా నచ్చిందా అని ఓ వ్యక్తి అడగగా.. నచ్చలేదని ఆ చిన్నారి బదులు ఇచ్చింది. అనంతరం ఈ వీడియోని ఆ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్తా షారుఖ్ ఖాన్ వరకూ చేరింది. దీంతో ఈ వీడియోపై ఈ నటుడు స్పందింస్తూ.. ఫన్నీగా రిప్లై ఇచ్చాడు.

షారుఖ్ ఇచ్చిన రిప్లైలో.. ‘ఓహో!! ఇప్పుడు మరింత కష్టపడాలి. తిరిగి డ్రాయింగ్ బోర్డుకి వెళ్లాలి. యువ ప్రేక్షకులను నిరాశపరచకూడదు. యువతతో నాకు ఇది సవాల్‌ వంటిది. PS: దయచేసి తనకి DDLJని చూపించండి.. బహుశా తనకి రొమాంటిక్ చిత్రాలు అంటే ఇష్టం కావొచ్చు.. పిల్లలకు ఏం కావాలో మనకి ఎప్పటికీ తెలియదు!’ అని సరదాగా రాసుకొచ్చాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

దీంతో ఇది చూసిన పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. షారుఖ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘మీరు సూపర్ సర్.. ఆ చిన్నారి వీడియోపై స్పందించారు’.. ‘అవును మీరు అన్నట్లు ఆ చిన్నారికి 90లలో షారుఖ్ సినిమాలు నచ్చుతాయనుకుంటా’ అని రాసుకొస్తున్నారు. అలాగే.. చిన్నారి చాలా క్యూట్‌గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - 2023-02-07T09:02:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising