Pathaan: ‘కెజియఫ్ 2’, ‘బాహుబలి 2’ రికార్డును బ్రేక్ చేసిన షారూఖ్ ఖాన్ సినిమా

ABN, First Publish Date - 2023-01-30T18:34:34+05:30

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan). తాజాగా ఆయన నటించిన సినిమా ‘పఠాన్’ (Pathaan). దీపికా పదుకొణె (Deepika Padukone), జాన్ అబ్రహాం (John Abraham) కీలక పాత్రలు పోషించారు.

Pathaan: ‘కెజియఫ్ 2’, ‘బాహుబలి 2’ రికార్డును బ్రేక్ చేసిన షారూఖ్ ఖాన్ సినిమా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan). తాజాగా ఆయన నటించిన సినిమా ‘పఠాన్’ (Pathaan). దీపికా పదుకొణె (Deepika Padukone), జాన్ అబ్రహాం (John Abraham) కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం పాన్ ఇండియాగా రూపొందింది. ప్రపంచవ్యాప్తంగా జనవరి 25న విడుదలైంది. రిలీజ్ అయినప్పటి నుంచి ఈ మూవీ రికార్డులను రాయడమే పనిగా పెట్టుకుంది. తాజాగా ‘కెజియఫ్ 2’ (KGF 2), ‘బాహుబలి 2’ (Baahubali 2) సినిమాల రికార్డును చెరిపేసింది. అత్యంత వేగంగా రూ.250కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రంగా నిలిచింది.

పఠాన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.271కోట్ల నెట్ కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. ఐదు రోజుల్లోనే ఈ స్థాయి వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. ‘కెజియఫ్ 2’ హిందీ వెర్షన్ ఈ ఫీట్‌ను సాధించడానికి 7రోజులు పట్టింది. ‘బాహుబలి 2’ ఎనిమిది రోజుల్లో ఈ ఘనతను అందుకుంది. దంగల్ పది రోజుల్లో ఈ ఫీట్‌ను సాధించింది. ‘పఠాన్’ రిలీజ్ అయినప్పటి నుంచి రికార్డులను రాయడమే పనిగా పెట్టుకుంది. ఈ చిత్రం రోజుకు వంద కోట్ల చొప్పున ఐదు రోజుల్లోనే రూ.500కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇండియాలో రూ.335కోట్ల గ్రాస్ వసూళ్లు, ఓవర్సీస్‌లో రూ.207కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను ఈ చిత్రం కొల్లగొట్టింది. వరల్డ్ వైడ్‌గా రూ.542కోట్ట గ్రాస్ వసూళ్లను సాధించింది. ‘పఠాన్’ స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. షారూఖ్ ఐదేళ్ల తర్వాత స్క్రీన్ పైకి ఎంట్రీ ఇస్తుండటంతో సినిమాపై విడుదలకు ముందే భారీ బజ్ ఉంది. ఆ అంచనాలను మంచి ఈ చిత్రం రాణిస్తుంది. షారూఖ్ చివరగా ‘జీరో’ (Zero) లో నటించారు. ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది.

Updated Date - 2023-01-30T18:38:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising