Shahrukh khan: నయన్‌ సో.. స్వీట్‌!

ABN, First Publish Date - 2023-02-06T13:44:01+05:30

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ (Shahrukh khan) ‘పఠాన్‌’ (Pathaan) సక్సెస్‌ను ఆస్వాదిస్తున్నారు. కొన్నాళ్లగా సరైన సక్సెస్‌ లేక కళ తప్పిన బాలీవుడ్‌కు ‘పఠాన్‌’ సక్సెస్‌ కాస్త ఊరటనిచ్చింది. నూతన ఉత్సాహాన్ని కలిగించింది.

Shahrukh khan:  నయన్‌ సో.. స్వీట్‌!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ (Shahrukh khan) ‘పఠాన్‌’ (Pathaan) సక్సెస్‌ను ఆస్వాదిస్తున్నారు. కొన్నాళ్లగా సరైన సక్సెస్‌ లేక కళ తప్పిన బాలీవుడ్‌కు ‘పఠాన్‌’ సక్సెస్‌ కాస్త ఊరటనిచ్చింది. నూతన ఉత్సాహాన్ని కలిగించింది. ప్రస్తుతం షారుక్‌ అట్లీ (Atlee) దర్శకత్వంలో వస్తున్న ‘జవాన్‌’ (jawaan)చిత్రంపై అంచనాలు పెరిగాయి. ఇందులో నయనతార హీరోయిన్‌. ఈ చిత్రంతో దర్శకుడు, అట్లీ, నయనతార బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఈ సినిమా షూటింగ్‌ తుది దశలో ఉంది.

తాజాగా షారుక్‌ ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. (shahrukh khan about nayanatara) ఇందులో ఓ నెటిజన్‌ నయన్‌ గురించి అడిగారు. అందుకు షారుక్‌ ‘‘ఆమె సో స్వీట్‌. మంచి అమ్మాయి. తనకు అనేక భాషలు తెలుసు. జవాన్‌ సినిమా కోసం ఆమెతో జత కట్టడం కొత్త అనుభూతినిచ్చింది. ఈ చిత్రంలో ఆమె నటన అందరికీ నచ్చుతుంది’’ అని నయన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. తమిళంలో సూపర్‌హిట్‌ చిత్రాలను అందించిన అట్లీ తొలిసారి హిందీలో తీసిన ఈ చిత్రం బాలీవుడ్‌ భవిష్యత్‌ను నిర్ణయించే చిత్రం అవుతుంది అని విశ్లేషకులు చెబుతున్నారు.

Updated Date - 2023-02-06T13:44:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising