ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kartik Aaryan: కారుకు జరిమానా విధించిన పోలీసులు

ABN, First Publish Date - 2023-02-18T20:45:37+05:30

సినీ ఇండస్ట్రీలో స్వశక్తితో ఎదిగిన నటుడు కార్తిక్ ఆర్యన్ (Kartik Aaryan). ‘ప్యార్ కా పంచ్ నామా’, ‘లవ్ అజ్ కల్ 2’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. కార్తిక్ తాజాగా ‘షెహజాదా’ (Shehzada) లో నటించారు. ఈ సినిమా రిలీజ్‌కు ముందు దర్శనం కోసం ఆయన సిద్ధి వినాయక ఆలయానికి వచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సినీ ఇండస్ట్రీలో స్వశక్తితో ఎదిగిన నటుడు కార్తిక్ ఆర్యన్ (Kartik Aaryan). ‘ప్యార్ కా పంచ్ నామా’, ‘లవ్ అజ్ కల్ 2’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. కార్తిక్ తాజాగా ‘షెహజాదా’ (Shehzada) లో నటించారు. ఈ సినిమా రిలీజ్‌కు ముందు దర్శనం కోసం ఆయన సిద్ధి వినాయక ఆలయానికి వచ్చారు. ఆ సమయంలో ఆయన నో పార్కింగ్ ఏరియాలో వాహనాన్ని నిలిపారు. ఫలితంగా కార్తిక్‌కు ముంబై పోలీసులు జరిమానా విధించారు. చలానా విధించిన విషయాన్ని పోలీసులు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అందుకు సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేశారు. ‘‘కారును రాంగ్ ఏరియాలో పార్క్ చేయడమే సమస్య. షెహజాదా కూడా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తారు. ఆ విషయాన్ని మాత్రం మరిచిపోకండి’’ అని ముంబై పోలీసులు ట్విటర్‌లో పోస్ట్ పెట్టారు.

టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ ‘అల వైకుంఠపురములో’ (Ala Vaikunthapurramuloo) కి రీమేక్‌గా ‘షెహజాదా’ రూపొందింది. ఈ చిత్రం కృతి సనన్ హీరోయిన్‌గా నటించారు. ఈ మూవీ‌కి రోహిత్ ధావన్ దర్శకత్వం వహించారు. రోనిత్ రాయ్, మనీషా కొయిరాలా, సచిన్ ఖడ్గేకర్, పరేష్ రావల్, రాజ్ పాల్ యూదవ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.ఈ సినిమాకు తొలి రోజు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. దాదాపుగా రూ. 7కోట్ల వరకు కలెక్షన్స్‌ను కొల్లగొట్టిందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ‘ఆషికి 3’, ‘సత్య ప్రేమ్ కీ కహానీ’ వంటి మరికొన్ని ప్రాజెక్టులు ఆయన చేతిలో ఉన్నాయి.

Updated Date - 2023-02-18T20:45:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising