Skin Care: మెడ కింద, చంకల్లో చర్మం నల్లగా, ఎబ్బెట్టుగా ఉందా? కొబ్బరి నూనెలో ఇదొక్కటి కలిపి రాస్తే చాలు మ్యాజిక్కే..
ABN, First Publish Date - 2023-07-05T16:26:45+05:30
మెడ, చంకల్లో చర్మం నల్లగా ఉంటుంది. దీన్ని వదిలించుకోవడం చాలా కష్టమని అనుకుంటారు. కానీ ఇదేమీ కష్టం కాదండోయ్.. కొబ్బరి నూనెలో కేవలం ఒకే ఒక్క పదార్థం కలిపి రాసుకుంటే
అందంగా కనిపించడంలో చర్మానిదే ప్రముఖ పాత్ర. మొటిమలు, మచ్చలు లేకుండా చర్మం చాలా క్లీన్ గా ఉండాలని చాలామంది అనుకుంటారు. ఇందుకోసం ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తుంటారు. మరికొందరికి మెడ వెనుక, చంకల్లోనూ చర్మం నల్లగా ఉంటుంది. ఈ కారణంగా చాలా మంది అమ్మాయిలు స్లీవ్ లెస్ దుస్తులు, బ్లౌజులు ధరించాలంటే చాలా ఇబ్బంది పడుతుంటారు. నలుగురిలోకి వెళ్ళాలన్నా ఇబ్బంది ఫీలవుతుంటారు. ఈ నలుపు మగవాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు కలిగిస్తుంది. దీన్ని వదిలించుకోవడం చాలా కష్టమని అనుకుంటారు. కానీ ఇదేమీ కష్టం కాదండోయ్.. కొబ్బరి నూనెలో కేవలం ఒకే ఒక్క పదార్థం కలిపి రాసుకుంటే నలుపంతా పోయి చర్మం తెల్లగా ముత్యంలాగా మెరిసిపోతుంది.
మెడ చుట్టూ చెమట పట్టడం, చర్మసంరక్షణ(skin care) తీసుకోకపోవడం వల్ల మెడ వెనుక భాగంలో(neck back) చర్మం నల్లగా మారుతుంది. ఇక చంకల్లో(under arns) అవాంచిత రోమాలు పెరగడం, వాటిని తొలగించుకునే క్రమంలో చంకల్లో చర్మం(skin black) కూడా నల్లబడుతుంది. ఈ నలుపు వదిలించుకోవడానికి కొబ్బరి నూనెతో కలిపి ఉపయోగించవలసిన పదార్థం టూత్ పేస్ట్. ఒక చిన్న కప్పులో ఒక చెంచా కొబ్బరినూనె(1tbs coconut oil) తీసుకోవాలి. ఇందులోకి ఒక చెంచా టూత్ పేస్టే(1tbs tooth paste) వేయాలి. ఇందులోకి అరచెంచా ఉప్పు(1/2tbs salt) కలపాలి. ఈ మూడింటిని బాగా మిక్స్ చేసి మెడ, చంకల్లో అప్లై చెయ్యాలి. తరువాత సగం నిమ్మకాయను(half lemon) తీసుకుని నలుపు ఉన్న ప్రాంతంలో రుద్దాలి. పదినిమిషాల సేపు ఇలా రుద్దిన తరువాత శుభ్రమైన నీళ్ళతో కడిగేయాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తే 15రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది.
Ice Cream: ఐస్ క్రీమ్ గురించి విస్తుపోయే నిజాలు .. ఆరోగ్య నిపుణులు ఏం చెప్పారంటే..
మెడ వెనుక భాగంలోనూ. చంకల్లోనూ నలుపు తొలగించుకోవడానికి పైన చెప్పుకున్న చిట్కా మాత్రమే కాకుండా మరిన్ని గృహ చిట్కాలు ఫాలో కావచ్చు. ఇప్పట్లో ప్రతి ఇంట్లో కలబంద(Aloe vera) మొక్క తప్పనిసరిగా ఉంటోంది. ఓ చిన్న కుండీలో అయినా సరే దీన్ని పెంచుకుంటూ ఉంటారు. తాజా కలబంద జెల్ సేకరించి ఆ జెల్ తో చంకల్లోనూ, మెడ వెనుక భాగంలోనూ మసాజ్ చేస్తున్నా మంచి ఫలితం ఉంటుంది. కలబంద గుజ్జులో కాసింత కీరాదోస రసాన్ని(cucumber juice) కలిపి కూడా వాడచ్చు. ఇది మాత్రమే కాకుండా బంగాళాదుంప(potato) కూడా నలుపు వదిలించడంలో సహాయపడుతుంది. బంగాళాదుంప రసం తీసి ఆ రసాన్ని నలుపు మీద అప్లై చేయాలి. ఇవన్నీ క్రమం తప్పకుండా వాడితే తొందరలోనే మంచి ఫలితం ఉంటుంది.
Viral Video: నది పుట్టడం ఎప్పుడైనా చూశారా? కళ్ళ ముందే ఎంతబాగా నది ఏర్పడిందో చూడండి..
Updated Date - 2023-07-05T16:26:45+05:30 IST