ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Smartphone Cleaning: అందరూ తెలియక చేస్తున్న బిగ్ మిస్టేక్ ఇదే.. వీటితో స్మార్ట్‌ఫోన్‌ను శుభ్రం చేస్తున్నారా..?

ABN, First Publish Date - 2023-08-21T16:42:19+05:30

స్మార్ట్ ఫోన్ స్క్రీన్ మీద గీతలు, పగుళ్లు, స్క్రీన్ చుట్టూ పేరుకునే దుమ్ము, ధూళి, ఫోన్ రంధ్రాలలో ఉన్న మురికి వంటివి తొలగించడానికి అందుబాటులో ఉన్న ఎన్నో వస్తువులు ఉపయోగిస్తుంటారు కానీ..

మనిషి జీవితాన్ని స్మార్ట్ ఫోన్ ఆక్రమించేసిందని చెప్పవచ్చు. తిండి, నీళ్లు లేకుండా ఒక్కరోజు అయినా ఉండగలుగుతారేమో కానీ ఫోన్ లేకుండా గంట కూడా ఉండలేరు. కొందరు స్మార్ట్ ఫోన్ పట్ల నిర్లక్ష్యంగా ఉంటే, మరికొందరు అతిజాగ్రత్త తీసుకుంటూ ఉంటారు. ఇలాంటివారు ఫోన్ ను శుభ్రం చేయడంలో పొరపాట్లు చేస్తుంటారు. స్మార్ట్ ఫోన్ స్క్రీన్ మీద గీతలు, పగుళ్లు, స్క్రీన్ చుట్టూ పేరుకునే దుమ్ము, ధూళి, ఫోన్ రంధ్రాలలో ఉన్న మురికి వంటివి తొలగించడానికి అందుబాటులో ఉన్న ఎన్నో వస్తువులు ఉపయోగిస్తుంటారు(smart phone cleaning). కానీ అవగాహన లేకుండా ఫోన్ శుభ్రం చేయడం ప్రమాదాన్ని కొనితెచ్చుకోవడమే అని అంటున్నారు టెక్ నిపుణులు, అసలు స్మార్ట్ పోన్ ను శుభ్రపరచడానికి వేటిని ఉపయోగించకూడదు? వేటిని ఉపయోగించాలి? ఎలా శుభ్రపరచాలి? తెలుసుకుంటే..

స్మార్ట్ ఫోన్ శుభ్రం చేయడానికి ఉపయోగించాల్సిన వస్తువులు..

స్మార్ట్ ఫోన్ శుభ్రత ముఖ్యమైనదే అయినా ఏవి పడితే వాటితో ఫోన్ శుభ్రం చేయకూడదు. ఫోన్ స్క్రీన్, బ్యాక్ కవర్ లోపలి భాగం వంటివి తుడవడానికి కాటన్(cotton), పేపర్ టవల్(paper towel),మైక్రో పైబర్ క్లాత్(micro fiber cloth) మొదలైనవి ఉపయోగించాలి. ఇక ఫోన్ రంధ్రాలలో దుమ్ము, ధూళి లేదా ఇతర పదార్థాల్లాంటివేమైనా ఇరుక్కుని ఉన్నట్టు అనిపిస్తే దాన్ని తొలగించడానికి టూత్ పిక్(tooth pick) ఉపయోగించవచ్చు.

స్మార్ట్ ఫోన్ శుభ్రం చేయడానికి ఉపయోగించకూడని వస్తువులు..

స్మార్ట్ ఫోన్ రంధ్రాల్లో ఏదైనా ఇరుక్కున్నప్పుడు చాలామంది చేసేపని సేఫ్టీ పిన్(safety pin) ఉపయోగించడం. కానీ ఇది సరైన పని కాదు. దీంతో పాటు సూది, స్టీల్, ఐరన్ పరికరాలు అస్సలు ఉపయోగించకూడదు. స్క్రీన్ తుడవడం కోసం వెట్ వైప్స్, తడిబట్ట, ఆల్కహాల్, లిక్విడ్ క్లీనర్స్, చాలా పదునుగా ఉండే పరికరాలు, టూత్ బ్రష్ లు ఉపయోగించకూడదు. వీటితో ఫోన్ శుభ్రం చేస్తే ఫోన్ లోపలి సున్నితమైన భాగాలు దెబ్బతిని ఫోన్ పేలుడు సంభవించే ప్రమాదం ఉంటుంది.

Viral Video: ఈ సైకిల్ ఓనర్ ట్యాలెంట్ మాములుగా లేదుగా.. కారుకు ధీటుగా ఇతను క్రియేట్ చేసిందేంటో చూస్తే అవాక్కవడం ఖాయం..



ఎలా శుభ్రపరచాలంటే..(how to clean smart phone)

సెల్ పాయింట్ కు వెళ్లకుండా స్మార్ట్ ఫోన్ ను ఇంటిదగ్గరే శుభ్రం చేసుకోవాలనుకునేవారు ఈ కింది విధానం ఫాలో అవ్వడం ద్వారా సురక్షితంగా ఫోన్ ను శుభ్రం చేసుకోవచ్చు.

స్మార్ట్ ఫోన్ స్క్రీన్ ను శుభ్రం చేయడానికి మైక్రో ఫైబర్ క్లాత్ ఉపయోగించాలి. దీనివల్ల ఫోన్ స్క్రీన్ మీద గీతలు పడే అవకాశం ఉండదు.

ఒకవేళ మైక్రో ఫైబర్ క్లాత్ లేకపోతే గోరువెచ్చని నీటిలో ముంచి బాగా పిండేసిన కాటన్ క్లాత్ ను ఉపయోగించవచ్చు. అయితే ఇలా చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్త అవసరం.

స్మార్ట్ ఫోన్ పోర్ట్ లను శుభ్రం చేయడానికి ఎల్లప్పుడూ టూత్ పిక్ ను ఉపయోగించడం ఉత్తమం.

టూత్ పిక్ కు ఒకవైపు పదునుగా ఉంటుంది. దీన్ని పోర్ట్ లపై ఉంచి వృత్తాకారంగా తిప్పుతూ సున్నితంగా శుభ్రం చేయాలి. ఇలా మొదట టూత్ పిక్ ను నేరుగా ఉపయోగించిన తరువాత రెండవసారి కాటన్ తీసుకుని టూత్ పిక్ పదునుభాగంలో ఉంచి ఇప్పుడు మొదట చేసినట్టే చేయాలి. ఇలా చేస్తే మురికి శుభ్రంగా పోతుంది.

Amazing Photo: ఈ ఫొటోలో మీకేం కనిపిస్తోంది.. ఎవరు తీశారో కానీ.. హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!


Updated Date - 2023-08-21T16:42:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising