ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral News: ఒకే ఒక్క పాము వల్ల.. ముగ్గురి ప్రభుత్వ ఉద్యోగాలు ఊస్ట్.. అసలేం జరిగిందో తెలిస్తే అవాక్కవడం ఖాయం..!

ABN, First Publish Date - 2023-07-10T17:26:59+05:30

అక్రమంగా అరెస్టు చేసిన ఓ వ్యక్తిని జైల్లో పాము కాటేయడంతో ముగ్గురు పోలీసులపై స్పెన్షన్ వేటు పడింది. బాధితుడిని వారు అక్రమంగా అరెస్ట్ చేశారన్న విషయం పాము కాటుతో వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఇలాంటి ఘటన బహుశా దేశంలో ఎక్కడా జరిగి ఉండదు. ఓ పాము కారణంగా ముగ్గురు పోలీసు ఆఫీసర్లు సస్పెండయ్యారు. అసలేం జరిగిందో తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. రాజస్థాన్‌లో ఘటన జరిగింది.

జైపూర్ జిల్లా ఖెజ్రోలీ ప్రాంతానికి చెందిన భగవాస్ సాహేపై రూ.20 లక్షలకు సంబంధించి చీటింగ్ కేసు నమోదైంది. అరెస్టుకాకుండా ఉండేందుకు అతడు ముందస్తు బెయిల్ కూడా పొందాడు. కానీ స్థానిక పోలీసులు ఇటీవల అతడిని అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని పైఅధికారులకు చెప్పలేదు. అతడిని స్టేషన్‌లోని సెల్‌లో పెట్టినట్టు రికార్డుల్లో కూడా రాయలేదు. ఇక ఇంటరాగేషన్ సందర్భంగా పోలీసులు అతడిని కొట్టినట్టు కూడా వార్తలు వెలువడ్డాయి. కాగా, ఆ రాత్రి అతడిని పాము కాటు వేయడంతో అతడు అచేతన స్థితిలోకి వెళ్లిపోయాడు. స్పృహ లేకుండా పడి ఉన్న అతడిని అధికారులు ఆ మరుసటి రోజు గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. దీంతో, విషయం ఉన్నతాధికారుల వరకూ వెళ్లింది. దీంతో, అక్రమఅరెస్టుకు తెరతీసిన ఏఎస్ఐ ప్రహ్లాద్ సింగ్, కానిస్టేబుళ్లు శిశురామ్, మహీపాల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. కాగా, బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఇటీవల కాలంలో కురుస్తున్న వర్షాలకు రాజస్థాన్‌లో పాముల బెడద ఎక్కువైందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఇళ్లల్లో కూడా పాములు వచ్చేస్తున్నాయని అంటున్నారు. కోటాలోని ఓ వ్యక్తి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. తన ఇంట్లోకి పాము రావడాన్ని అతడు గమనించడంతో పెను ప్రమాదం తప్పింది.

Updated Date - 2023-07-10T17:29:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising