ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Spain: మహిళలకు ఆ రోజుల్లో ప్రత్యేక సెలవులు.. ఆమోదించిన స్పెయిన్ ప్రభుత్వం.. యూరోప్‌లోనే తొలి దేశంగా..

ABN, First Publish Date - 2023-02-17T20:45:22+05:30

స్పెయిన్ ప్రభుత్వం తాజాగా ఓ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. మహిళలకు మేలు చేసే ఓ ప్రత్యేక బిల్లుకు స్పెయిన్ చట్ట సభ సభ్యులు గురువారం ఆమోదం తెలిపారు. ఇకపై పీరియడ్స్ నొప్పులతో బాధపడే మహిళలకు చెల్లింపుతో కూడా సెలవులను మంజూరు చేయబోతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్పెయిన్ (Spain) ప్రభుత్వం తాజాగా ఓ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. మహిళలకు మేలు చేసే ఓ ప్రత్యేక బిల్లుకు స్పెయిన్ చట్ట సభ సభ్యులు గురువారం ఆమోదం తెలిపారు. ఇకపై పీరియడ్స్ నొప్పులతో బాధపడే మహిళలకు చెల్లింపుతో కూడా సెలవులను (Menstrual Leave) మంజూరు చేయబోతున్నారు. ఇటువంటి చట్టాన్ని తీసుకొచ్చిన తొలి యూరోపియన్ దేశంగా (First European country) స్పెయిన్ నిలవనుంది. స్త్రీవాద పురోగతిలో ఇది మర్చిపోలేని రోజు అని చట్టసభలో ఓటు వేయడానికి ముందు స్పెయిన్ మంత్రి ఐరీన్ మోంటెరో ట్వీట్ చేశారు.

స్పానిష్ గైనకాలజీ అండ్ అబ్‌స్ట్రెట్రిక్స్ ప్రకారం రుతుస్రావ సమయంలో మూడో వంతు మంది మహిళలు తీవ్ర నొప్పిని ఎదుర్కొంటున్నారు. ఇకపై అలాంటి బాధలు పడే మహిళల డాక్టర్ సర్టిఫికెట్‌తో సెలవులను పొందవచ్చు. స్పెయిన్‌లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు మహిళలకు ఈ హక్కున కల్పించాలి. కాగా, ఈ బిల్లును కొంత మంది సమర్థిస్తుంటే, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ బిల్లు వల్ల మహిళలకు ఉద్యోగావకాశాలు తగ్గే ప్రమాదం ఉందని కొందరు వ్యాఖ్యానించారు.

Bangladesh: బంగ్లాదేశ్‌లో తెలుగు వారికి కష్టాలు.. వారి ఇళ్లు కూల్చివేయాలని నిర్ణయం.. అసలు తెలుగు వారు అక్కడ ఏ చేస్తుంటారంటే..

మహిళలకు లభించే రుతుక్రమ సెలవులు వారికి వ్యతిరేకంగా మారతాయని, చాలా కంపెనీలు పురుషుల నియామకానికి మొగ్గు చూపే వీలుందని స్పెయిన్‌లోని అతిపెద్ద కార్మిక సంఘం అయిన UGT సభ్యులు వ్యాఖ్యానించారు. కాగా, మహిళల హక్కుల విషయంలో రాజీ పడని స్పెయిన్ 1985లోనే అబార్షన్‌ను నేర రహితం చేసింది. అలాగే గర్భం దాల్చిన మొదటి 14 వారాలలో స్వేచ్ఛగా అబార్షన్‌ను ఎంచుకోవచ్చని పేర్కొంది.

Updated Date - 2023-02-17T20:45:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising