ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Naked Walk: వీధుల్లో నగ్నంగా నడిచాడు.. తప్పేమీ కాదంటూ జరిమానా రద్దు చేసిన హైకోర్టు!

ABN, First Publish Date - 2023-02-04T18:41:05+05:30

స్పెయిన్‌( Spain)లోని వాలెన్సియా(Valencia) ప్రాంతంలో ఓ వ్యక్తి సరదాగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాడ్రిడ్: స్పెయిన్‌( Spain)లోని వాలెన్సియా(Valencia) ప్రాంతంలో ఓ వ్యక్తి సరదాగా అలా ఒంటిపై బట్టల్లేకుండా వీధుల్లో షికారు చేశాడు. అతడిని చూసిన పోలీసులు ఇదేం పనయ్యా బాబూ! అంటూ జరిమానా విధించారు. ఇది అన్యాయమంటూ అతడు కోర్టుకెళ్తే.. న్యాయస్థానం అతడికి అనుకూలంగా తీర్పు చెప్పింది. అందులో తప్పేముందంటూ కోర్టు ఆ జరిమానాను రద్దు చేసింది. ఆశ్చర్యంగా ఉంది కదూ!

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అల్డాయా(Aldaia)కు చెందిన 29 ఏళ్ల అలజాండ్రో కొలోమర్(Alejandro Colomar) కొన్నాళ్ల క్రితం వీధుల్లో నగ్నంగా నడుస్తుంటే పోలీసులు చూసి జరిమానా విధించారు. నగ్నంగా నడిస్తే ఫైన్ వేసేస్తారా? ఇదెక్కడి న్యాయమంటూ కొలోమర్ హైకోర్టును ఆశ్రయించాడు. విచారణకు కూడా దుస్తులు లేకుండా కేవలం బూట్లు మాత్రమే ధరించి హాజరయ్యేందుకు ప్రయత్నించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. కోర్టుకు దిశమొలతో హాజరయ్యేందుకు వచ్చిన కొలోమర్‌ను చూసిన అధికారులు దుస్తులు ధరిస్తే తప్ప లోపలికి అడుగుపెట్టడానికి వీల్లేదని చెప్పడంతో అప్పుడు దుస్తులు ధరించి విచారణకు హాజరయ్యాడు.

ఈ సందర్భంగా కొలోమర్ తన వాదనను సమర్థించుకున్నాడు. జరిమానా విధించడమంటే తన సైద్ధాంతిక స్వేచ్ఛను ఉల్లంఘించడమేనని వాదించాడు. జరిమానాకు అర్థం లేదన్నాడు. పోలీసులు తనది అశ్లీల ప్రదర్శన అని ఆరోపిస్తున్నారని, డిక్షనరీ ప్రకారం.. అశ్లీల ప్రదర్శన అనేది లైంగిక ఉద్దేశాన్ని సూచిస్తుందని, కానీ తన నడకకు దానితో ఎలాంటి సంబంధం లేదని వాదించాడు. అతడి వాదనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు పోలీసులు విధించిన జరిమానాను రద్దు చేసింది. కొలోమర్ రెండు వేర్వేరే సమయాల్లో అల్డాయాలోని రెండు వేర్వేరు వీధుల్లో తిరిగినట్టు కోర్టు పేర్కొంది. అతడి ప్రవర్తన వల్ల పౌరుల భద్రతకు కానీ, ప్రశాంతతకు గానీ భంగం వాటిల్లలేదని కోర్టు స్పష్టం చేసింది.

స్పెయిన్‌లో చట్టపరమైన శూన్యత (Legal Vaccum) కారణంగా ఇలాంటి విషయాలు అక్కడ చాలా సర్వసాధారణమైన విషయాలుగా మారిపోయాయి. ప్రజలు నగ్నంగా తిరగడం చట్టానికి వ్యతిరేకం కాదని న్యాయవ్యవస్థ చెబుతోంది. తాజా కేసులోనూ అదే నిజమైంది. బహిరంగ నగ్నత్వం అనేది స్పెయిన్‌లో 1988 నుంచి చట్టబద్ధమే. అక్కడ ఎవరైనా, ఎప్పుడైనా ఒంటిపై దుస్తుల్లేకుండా వీధుల్లో అలా తిరిగి రావొచ్చు. అయితే, వల్లాడోలిడ్ (Valladolid), బార్సెలోనా (Barcelona) వంటివి మాత్రం దీనిని నియంత్రించేందుకు సొంత చట్టాలు తీసుకొచ్చాయి.

Updated Date - 2023-02-04T18:56:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising